రాజా షూటింగును అప్పుడే టచ్ చేస్తాడు

Thu Sep 14 2017 12:48:32 GMT+0530 (IST)

ఎంతో కష్టపడి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగిన స్టార్.. మాస్ మహారాజా రవితేజా. ఆయనకు సినిమాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో సినిమాలను చేస్తూ.. గ్యాప్ లేకుండా సినిమాలు చేయగల సత్తా ఉన్న హీరో. ముఖ్యంగా నటనలో ఈ హీరోకు ఉన్న స్టయిలే వేరు అని చెప్పాలి. అయితే గత కొంత కాలంగా రవితేజ లక్ ఏమి బాలేదు. ఎంత కష్టపడినా సినిమాలు నిరాశపరుస్తున్నాయి. ఆఖరికి తనకు లైఫ్ ఇచ్చిన దర్శకులు కూడా రవికి అపజయాలనే ఇచ్చారు.కానీ రవితేజ ఎనర్జీకి ఇంకా మంచి కథలు ఉన్నాయని కొందరు యువ దర్శకులు రవి తేజను ఎంచుకొని మరి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం "రాజా ది గ్రేట్" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రవి త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకొని వచ్చే దీపావళికి సందడి చేయబోతున్నాడు. ఇక ఆ సినిమా అయిపోగానే స్క్రీన్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ సిరికొండ మొదటి సారి దర్శకత్వం వహించబోతున్న టచ్ చేసి చూడు సినిమాను మొదలు పెట్టనున్నాడు.ఇప్పటికే ఆ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాని ఈ సినిమా షూటింగును టెంపరరీగా ఆపేశారట. ఎందుకంటే రాజా ది గ్రేట్ కోసం వాడుతున్న లుక్ మరియు టచ్ చేసి చూడులోని లుక్ చాలా తేడాగా ఉన్నాయట. అనవసరంగా ఇటూ అటూ ప్రయోగాలు చేస్తే.. ఫీల్ పోతోందని ఫీలై.. ముందు రాజా ది గ్రేట్ పూర్తి చేసి.. అప్పుడు టచ్ చేసి చూడును టచ్ చేస్తాడట మాస్ రాజా.

ఇక విక్రమ్ సిరికొండ ఇప్పటికే టచ్ చేసి చూడు కు సంబందించిన చిత్ర యూనిట్ ని మొత్తం సిద్ధం చేసి ఉంచుకున్నాడు.రవి తేజ వస్తే ఇక సినిమాను షూటింగ్ ను స్పీడ్ గా ముందుకు తీసుకెళ్లడమే అంటున్నాడు దర్శకుడు. మరి ఈ రెండు చిత్రాలు రవికి ఎంతవరకు విజయాన్ని అందిస్తాయో చూడాలి.