'బ్లైండ్' గా ఫిక్సయిన మాస్ మహా 'రాజా'!

Mon Jun 19 2017 20:12:46 GMT+0530 (IST)

మాస్ మహారాజ్ రవితేజ తన సినిమాల దూకుడు తగ్గించినట్టున్నాడు. గతంలో సంవత్సరానికి 5-6 సినిమాలు విడుదల చేసేవాడు.  బెంగాల్ టైగర్ తర్వాత మరో సినిమా విడుదల కాలేదు. రవితేజ సినిమా విడుదలై దాదాపు 20 నెలలు కావస్తోంది. మరో రెండు నెలలకు అతడి కొత్త సినిమా విడుదలయ్యే అవకాశముంది. రవితేజ తన సినిమాల విడుదల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఓకే సారి నాలుగు సినిమాలకు ఓకే చెప్పాడు.

ఆ నాలుగు చిత్రాల్లో రెండింటిని  ఆల్‌రెడీ మొదలుపెట్టాడు. మిగతా రెండిటినీ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమాపై రవితేజ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందుకే అంధుడి పాత్ర పోషిస్తున్న 'రాజా ది గ్రేట్' చిత్రాన్ని మొదటగా ప్రేక్షకుల ముందుకు తేవాలని రవితేజ ఫిక్సయ్యాడు.

కమర్షియల్ పల్స్ బాగా తెలిసిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ తెరకెక్కుతుంది. పటాస్ - సుప్రీం వంటి రెండు వరుస హిట్లతో అనిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రవితేజ నటిస్తున్న 'టచ్ చేసి చూడు' - 'రాజా ది గ్రేట్' చిత్రాలు దాదాపు ఒకే లెవల్ వరకు పూర్తయ్యాయి. వీటిలో వెరైటీ స్టోరీతో రాబోతున్న 'రాజా ది గ్రేట్' పూర్తి చేసి విడుదల చేయాలని రవితేజ నిర్ణయించుకున్నాడు.

రాజా ది గ్రేట్ చిత్రానికి సెప్టెంబర్ లో ఫుల్ కాంపిటీషన్ ఉంది. ఆ చిత్రానికి నిర్మాత దిల్ రాజు కనుక థియేటర్ల విషయంలో సమస్య. కనుక అటు స్టోరీ పరంగా ఇటు రిలీజ్ ప్లానింగ్ పరంగా ఇది బెస్ట్ ఆప్షన్ అని రవితేజ 'రాజా'తో 'బ్లైండ్'గా వెళ్లిపోతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/