సినిమా పోయినా సీరియస్ గా తీసుకోను

Mon May 21 2018 23:39:24 GMT+0530 (IST)

టాలీవుడ్ లో చాలా వేగంగా సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ఒకరు. కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేయడంలో మాస్ రాజా ముందుంటాడు. బెంగాల్ టైగర్ తరువాత 2016 కి కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా మళ్లీ రాజా ది గ్రేట్ సినిమాతో రికవర్ అయ్యారు. అది కూడా తన రెగ్యులర్ కమర్షియల్ కాన్సెప్ట్ ని పక్కన పెట్టి మరి ఒక అంధుడిగా కనిపించి సక్సెస్ అందుకున్నాడు.అయితే మాస్ రాజా తన కెరీర్ లో ఎన్నో గెలుపోటములను చూశాడు. తన ఎనర్జీతో ఏ మాత్రం మార్పులు చేయకుండా అదే కంటిన్యూ చేశాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ తన ఎనర్జీ సీక్రెట్ గురించి ఒక వివరణ ఇచ్చాడు. 'సాధారణంగా నాకు డల్ గా ఉండాలంటే ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి నేను ఇంతే. ఎలా ఉన్న కూడా లైఫ్ లో ముందుకు వెళ్లడమే. ఎనర్జీ అనేది మనలోనే ఉంటుందని ఓటమికి కృంగిపోను అని చెప్పాడు.

నిజానికి రవితేజకు ఉన్న ఈ మంచి అలవాటు చాలామంది హీరోలకు ఉంటే బాగుంటుంది అంటున్నారు ఇండస్ర్టీ జనాలు. ఎందుకంటే రెండు ఫ్లాపులు రాగానే వారిలో వారే కుంగిపోయి చెత్త కథలను ఎంపిక చేసుకుని మరిన్ని ఫ్లాపులు కొట్టడం.. లేదంటే కొంతమంది ఆత్మసంతర్పణ చేసుకోవడం.. లేదంటే అసలు కోలుకోలేనంత బాధల్లోకి జారిపోవడం.. ఇక అలవాటుగా వస్తోంది. అందుకే రవితేజను చూసి అటువంటి హీరోలు కాస్త జ్ఞానోదయం చేసుకుంటే బెటర్ అంటున్నారు నెటిజన్లు.