Begin typing your search above and press return to search.

రవితేజ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

By:  Tupaki Desk   |   5 Oct 2015 3:30 PM GMT
రవితేజ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
X
రవితేజ హీరో అయ్యాక ఎప్పుడూ గ్యాప్ తీసుకుంది లేదు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకెళ్లిపోయాడు. ఐతే ఆ మధ్య వరుసగా అరడజను ఫ్లాపులు కొట్టినపుడు మాత్రమే బండి కొంచెం స్లో అయింది. ఐతే ‘బలుపు’ తర్వాత మళ్లీ జోరందుకున్నాడు. కిక్-2 చేస్తుండగానే.. ‘బెంగాల్ టైగర్’ కూడా మొదలుపెట్టాడు. పూర్తి చేసేశాడు. ఇప్పుడిక తర్వాతి సినిమాకు షిఫ్ట్ అయిపోయాడు. దిల్ రాజు నిర్మాణంలో ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో త్వరలోనే మాస్ రాజా సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది.

ఈ సినిమాకు ఇంతకుమందు ‘ఎవడో ఒకడు’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఐతే అదంత యాప్ట్ టైటిల్ కాదంటూ.. కొత్త టైటిల్ అనుకుంటున్నారట. అదే.. భోగి. దీనికి ‘ఆనందంగా ఉండేవాడు’ అనే ట్యాగ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు. హీరో పేరు భోగేశ్వరరావు అని.. దాన్ని షార్ట్ చేసి ‘భోగి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ఇది మాస్ ఆడియన్స్ కు ఈజీగా కనెక్టవుతుందని అనుకుంటున్నారు. ‘ఓ మై ఫ్రెండ్’తో క్లాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు శ్రీరామ్.. ఈసారి మాస్ రాజా స్టయిల్లో పక్కా మాస్ సబ్జెక్టు రెడీ చేశాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయి. దీంతో పాటే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘స్పెషల్ చబ్బీస్’ రీమేక్ లోనూ రవితేజే నటించే అవకాశాలున్నాయి.