అప్పుడే రీషూట్లు కూడా అయిపోయాయ్

Thu May 17 2018 22:29:29 GMT+0530 (IST)

మాస్ మహారాజా రవితేజ తనకు అలవాటయిన.. కలిసొచ్చిన మాస్ ఎంటర్ టెయినర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. కురసాల కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో నేల టిక్కెట్ సినిమా చేశాడు.  ఈనెల 24న రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు. షూటింగ్ పని మొత్తం అయిపోయిందని అందరూ అనుకున్నా ఇంకా సినిమా యూనిట్ ఆ హడావుడి నుంచి బయటకు రాలేదు.ప్రస్తుతం నేలటిక్కెట్ లో కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది అనుకున్నాక కొన్ని సీన్స్ ఎడిటింగ్ టేబుల్ వద్ద చూసి అనుకున్న స్థాయిలో రాకపోవడంతో రీషూట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన టైంలో రీ షూట్ అంటే ఓ రకంగా రిస్క్ చేయడమే. కానీ కొన్ని సీన్లలో అవుట్ పుట్ క్వాలిటీగా లేకపోవడంతో తిరిగి షూటింగ్ చేయడమే కరెక్టని ఫిలిం మేకర్లు డిసైడయ్యారట. రవితేజతోపాటు మరికొందరు యాక్టర్లతో అనుకున్న సీన్లు గడిచిన రెండు రోజుల్లో షూట్ చేసేశారట.  

సోగ్గాడే చిన్నినాయనా.. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో ఫ్యామిలీ ఎంటర్ టెయినర్లు తీసిన కురసాల కళ్యాణ్ కృష్ణ మొదటి సారి మాస్ ఎంటర్టయినర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్.ఆర్.టి. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న నేలటిక్కెట్ సినిమాతో కొత్త అందం మాళవిక శర్మ తెలుగు తెరరకు పరిచయం అవుతోంది.