Begin typing your search above and press return to search.

సొమ్ముల కోసం తొందరెందుకు రాజా!?

By:  Tupaki Desk   |   9 Feb 2016 10:30 PM GMT
సొమ్ముల కోసం తొందరెందుకు రాజా!?
X
మాస్ మహరాజ్ రవితేజ ఇప్పుడు సూపర్ ఫాంలో ఉన్నాడనే చెప్పాలి. గత నాలుగు సినిమాల్లో మూడు హిట్స్ గా నిలవడం చిన్న విషయమేం కాదు. కిక్2 మినహాయించి.. బలుపు, పవర్, బెంగాల్ టైగర్ లు సక్సెస్ సాధించాయంటే.. అందుకు రవితేజ స్టామినానే మెయిన్ రీజన్. కానీ ఇప్పుడు రవితేజ ప్రాజెక్టులు ఇరకాటంలో పడుతున్నాయి.

మాస్ మహరాజ్ హీరోగా వేణు శ్రీరాం డైరెక్టర్ గా దిల్ రాజు సినిమా అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత రవితేజ ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడనే కారణంతో డ్రాప్ అయ్యాడు. రీసెంట్ గా చక్రి అనే కొత్త డైరెక్టర్ తో రాబిన్ హుడ్ పేరుతో కేఎల్ దామోదర ప్రసాద్ ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌ గా సైన్‌ చేసిందనే న్యూస్‌ కూడా చెప్పుకున్నాం. ఇదే ప్రాజెక్టు గురించి ఇప్పుడు మరొక టాక్‌ వినిపిస్తోంది. కనీసం 9 కోట్లు ఇవ్వందే సినిమా ను మరో 10 రోజుల్లో సెట్స్‌ మీదకు తీసుకెళ్ళే ప్రసక్తే లేదంటున్నాడట మాస్‌ రాజా.

ఇప్పుడు రవితేజ ఇంతగా డబ్బు విషయంలో పట్టు పట్టడానికి కారణాలు ఏంటా అనుకుంటున్నారు చాలామంది. అలాగే రెమ్యూనరేషన్ దగ్గర గట్టిగా ఉండకుండా.. అదేదో సినిమాలో వాటా తీసుకుంటే.. అటు ప్రొడ్యూసర్ కి కూడా ఊరట ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఇదే రూట్ లో ఉన్నారు కదా. సినిమాని సక్సెస్ చేసి.. రెమ్యూనరేషన్ ని రాబట్టుకునే అవకాశం ఉన్నపుడు.. ముందే తొందరపడి ప్రాజెక్టులు వదులుకోవడం ఎందుకు?