Begin typing your search above and press return to search.

రవితేజ కమిట్మెంట్ చూసి మండిపతున్నారు

By:  Tupaki Desk   |   26 Jun 2017 12:51 PM GMT
రవితేజ కమిట్మెంట్ చూసి మండిపతున్నారు
X
హీరో రవితేజ ఫిలిం ఇండస్ర్టీలో చాలా కష్టపడి ఒక స్థాయికి వచ్చాడు. బహుశా అందుకే మనోడి స్టార్డమ్ ను మెగాస్టార్ చిరంజీవి తరువాత అలా బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి వచ్చింది మనోడు అంటూ చెబుతుంటారు. కాకపోతే ఎంతటి స్టార్ అయినా కూడా ఫ్యామిలీ మ్యాటర్ వరకు వచ్చేసరికి ఒక సాదాసీదా మనిషిగానే ఉంటారు. కాని ఎందుకో ఇప్పుడు రవితేజ ప్రవర్తన మాత్రం నెటిజన్లకు కాస్త నొప్పిని కలిగిస్తోంది.

నిన్నే ఆల్రెడీ భరత్ అంత్యక్రియలకు రాలేదని రవితేజను చాలామంది నెటిజన్లు తిడుతున్న సంగతి తెలిసిందే. నిజంగానే తమ్మడి చిద్రమైన బాడీని చూడటం ఇష్టం లేకపోయినప్పటికీ.. కడసారి చూపును చూడకపోతే ఎలా? అంటూ ఇంటర్నెట్లో చాలామంది నిలదీశారు. పైగా ఒక్కసారి ఖననం చేసిన తరువాత తిరిగి ఆ బాడీ ఇక రాదు కదా.. ఒకవేళ మరోసారి రవితేజ చూద్దామన్నా కూడా. ఇప్పుడు మరో విషయం ఏంటంటే.. ఇంట్లో అంతటి దిగ్ర్భాంతికరమైన చర్య చోటుచేసుకున్నా కూడా.. ఈరోజు షూటింగ్ కు వచ్చేశాడట రవితేజ.

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇప్పుడు ''రాజా ది గ్రేట్'' సినిమాను షూట్ చేయడానికి ఒక సెట్ వేయించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. గతంలో తన భార్య చనిపోతే నిర్మాత దిల్ రాజు షూటింగ్ ఆగకుండా నాలుగు రోజులు గ్యాప్ లో వచ్చేసినట్లు.. ఇప్పుడు రవితేజ అసలు బ్రేక్ అనేదే తీసుకోకుండా ఈరోజు షూటింగుకు వచ్చాడట. ఆయనంటే ప్రొడ్యూసర్ కాబట్టి.. షూటింగుకు వచ్చినా రాకపోయినా పర్లేదు కాని.. ఈయన హీరో కదా.. రాకపోతే చాలా నష్టం వస్తుంది.. అందుకే వచ్చేశాడు అంటున్నారు యునిట్ వర్గాలు. కాని ఈ కమిట్మెంట్ అంతా ఎందుకు? తమ్ముడికి కనీసపు విలువ కూడా ఇవ్వడా? అంటూ సినిమా లవర్స్ అప్సెట్ అయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/