Begin typing your search above and press return to search.

సైరా కోసం సురేందర్ రెడ్డి ఫేవరేట్

By:  Tupaki Desk   |   23 Nov 2017 7:02 AM GMT
సైరా కోసం సురేందర్ రెడ్డి ఫేవరేట్
X
టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అందరు ఆ స్థాయి అంచనాలతో ఎదురుచూస్తోన్న చిత్రం మెగాస్టార్ సైరా కోసమే. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆదారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కరెక్ట్ గా ఎప్పుడు రిలీజ్ అవుతోందో గాని సినిమా గురించి ప్రస్తుతం వస్తోన్న చిన్న అప్డేట్ కూడా బారి స్థాయిలో అంచనాలను రేపుతోంది. సినిమాలో ఇప్పటికే మంచి క్యారెక్టర్స్ కి గొప్ప నటి నటులు కూడా సెట్ అయ్యారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు సౌత్ స్టార్స్ నయనతార - జగపతి బాబు అలాగే సుదీప్ అండ్ విజయ్ సేతుపతి సినిమాలో నటించబోతోన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా మరొక నటుడు సెలెక్ట్ అయ్యాడు. ఇంతకుముందు సురేందర్ సినిమాల్లో బెస్ట్ విలన్ గా మంచి ప్రశంసలను అందుకున్నాడు అతను. భోజపురి సినిమాలతోబాగా పాపులర్ అయిన రవి కిషన్ రేసుగుర్రం సినిమాతో మద్దాలి శివారెడ్డి అంటూ థియేటర్స్ ని షేక్ చేశాడు. కిక్ 2 సినిమాలో కూడా అలరించాడు. అయితే ఇప్పుడు మరోసారి సురేందర్ సైరా సినిమాలో రవి కిషన్ కి మంచి పాత్రను ఇచ్చాడు. సినిమాలో ఈ విలక్షణ నటుడి పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది.

సురేందర్ రెడ్డి విలన్స్ ని చూపించడంలో చాలా మంచి దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక చారిత్రాత్మక సినిమాల్లో ఎలా చూపిస్తాడా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ దర్శకుడు సైరాలో విలన్స్ ని ఎలా చూపిస్తాడో చూడాలి.