Begin typing your search above and press return to search.

సుప్రీమ్ విలన్ షూటింగ్ కి వచ్చేశాడు

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:55 AM GMT
సుప్రీమ్ విలన్ షూటింగ్ కి వచ్చేశాడు
X
రవి కిషన్ ను ఆ పేరుతో కంటే.. రేసుగుర్రం విలన్ గానే జనాలు ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారు. మద్దాలి శివారెడ్డి పాత్ర ఈ విలన్ కి బాగా పేరు తెచ్చింది. రెండు నెలల క్రితం షూటింగ్ లో గాయపడి హాస్పిటల్ పాలైన రవికిషన్.. ఇప్పుడు మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసేశాడు.

రాజస్థాన్ లోని జైసల్మీర్ లో సుప్రీమ్ షూటింగ్ జరుపుతున్న సమయంలో డిసెంబర్ 17న రవి కిషన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో హాస్పిటల్ లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి కంప్లీట్ రెస్ట్ తీసుకున్న రవికిషన్.. ఇప్పుడు కోలుకున్నాడు. 'యస్, నేను సెట్స్ కి వచ్చేశాను. ఓ యాక్షన్ సీన్ లో కూడా పాల్గొన్నా. కానీ భారీ యాక్షన్ సన్నివేశాలకు మాత్రం దూరంగానే ఉంటున్నా. ఇందుకు కారణం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడమే. అందుకే అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా' అని చెప్పాడు రవికిషన్.

మెగా సుప్రీం స్టార్ సాయిధరం తేజ్ - రాశి ఖన్నా జంటగా నటించిన సుప్రీంలో.. రవికిషన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఇందులో యాక్షన్ సన్నివేశాలకు బాగా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. హీరో క్యాబ్ డ్రైవర్, హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ కావడంతో.. హీరోయిన్ కి కూడా యాక్షన్ సీన్స్ బాగానే ఉంటాయట.