Begin typing your search above and press return to search.

పంది కోసం అన్ని కోట్లు..

By:  Tupaki Desk   |   30 July 2016 9:31 AM GMT
పంది కోసం అన్ని కోట్లు..
X
డిఫరెంట్ సినిమాలు తీయడమే కాదు.. డిఫరెంట్ టైటిల్స్ తోనూ ఆకట్టుకుంటారు రవిబాబు. ప్రస్తుతం ఈ దర్శకుడు తీస్తున్న సినిమా 'అదుగో'. ఓ పంది పిల్లను ప్రధాన పాత్రలో పెట్టి మూవీ చేసేస్తున్నాడు. ఈ సినిమాకు రవిబాబు పెట్టిన బడ్జెట్ చూసి చాలామంది నోరెళ్ల బెట్టేస్తున్నారు.

పంది పిల్లను ప్రధాన పాత్రలో పెట్టి తీస్తున్న సినిమాకి రూ. 5 కోట్ల బడ్జెట్ పెట్టేశాడు రవిబాబు. ఈ మూవీని తనే స్వయంగా ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై రవిబాబు తీస్తుండగా.. సురేష్ బాబు సమర్పిస్తున్నారు. అదుగో మూవీలో కేవలం గ్రాఫిక్స్ కోసమే 2 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే హాలీవుడ్ నుంచి యానిమ్యాట్రిక్స్ టెక్నాలజీని పట్టుకొచ్చి సినిమా చేశాడు రవిబాబు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ కోసం భారీ ఖర్చు.

అదుగో చిత్రాన్ని కంప్లీట్ చేయడానికి 40 రోజులు పడితే.. గ్రాఫిక్స్ కోసం 4 నెలలు కేటాయించారట. రవిబాబు కెరీర్ లో లడ్డూబాబు తర్వాత బిగ్గెస్ట్ బడ్జెట్ అంటున్నారు. ఏమైనా ఓ పిగ్లెట్ కోసం ఇంత బడ్జెట్ పెట్టిన రవిబాబు నమ్మకాన్ని పొగడాల్సిందే. ఇది హిట్ అయితే.. ఈ టైపు చిత్రాలు మరిన్ని తెలుగులో క్యూ కట్టేయచ్చు.