Begin typing your search above and press return to search.

రత్తాలు పాట.. ప్రకంపనలే

By:  Tupaki Desk   |   20 Jan 2017 11:39 AM GMT
రత్తాలు పాట.. ప్రకంపనలే
X
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీకి సంబంధించి ఏ విశేషం బయటికి వచ్చినా సోషల్ మీడియా షేకైపోయింది. టీజర్.. ట్రైలర్.. యూట్యూబ్ లో వ్యూస్ పరంగా తెలుగు సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశాయి. ఇక ఆ సినిమాలోని పాటలకు సంబంధించి లిరికల్ వీడియోలు రిలీజ్ చేసినా నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అందులోనూ ‘రత్తాలు రత్తాలు’ పాట అయితే యూట్యూబ్ లో ఇన్ స్టంట్ హిట్టయిపోయింది. దీని లిరికల్ వీడియో రిలీజ్ చేసిన నెల రోజుల్లోపే కోటి వ్యూస్ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వీడియోలో లిరిక్స్ తో పాటుగా కొన్ని విజువల్స్ కూడా చూపించారు.

ఇలాంటి వీడియోకే ఇంతగా జనాలు స్పందించారంటే.. రేప్పొద్దున దీని ఒరిజినల్ పాటను రిలీజ్ చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ఈ పాటలో చిరు ‘ఇంద్ర’ వీణ స్టెప్పుతో పాటు చక్కటి మూమెంట్స్ చేశాడు. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యా వీడియో సాంగ్స్ రిలీజ్ చేసే అవకాశముంది. సినిమాకు పాటలు.. చిరు స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నేపథ్యంలో తెలుగు వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో నెలకొల్పిన రికార్డులన్నింటినీ ‘ఖైదీ నెంబర్ 150’ బద్దలు కొట్టే అవకాశముంది. గత ఏడాది ‘జనతా గ్యారేజ్’ పాటల్ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే అనూహ్యమైన స్థాయిలో వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/