Begin typing your search above and press return to search.

రూమర్ కు భలే రెస్పాన్స్ ఇచ్చిన రష్మిక

By:  Tupaki Desk   |   18 Nov 2018 10:42 AM GMT
రూమర్ కు భలే రెస్పాన్స్ ఇచ్చిన రష్మిక
X
ఇళయదళపతి అని ఫ్యాన్స్ ప్రేమగా పిలుచుకునే విజయ్ కొత్త సినిమా #దళపతి63 ఈమధ్యనే లాంచ్ చేశారు. ఈ సినిమాకు దర్శకుడు అట్లీ. ఇక సినిమా ప్రారంభం అయినప్పటి నుండి ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోందని ఒకటే వార్తలు. దీంతో ఇదే విషయంపై ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది రష్మిక.

రష్మిక ఫ్యాన్ క్లబ్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి మొదట ఇలా ట్వీట్ వచ్చింది.."బజ్: #దళపతి63 లో హీరోయిన్ రష్మిక అఫిషియల్ కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తోంది." దీనికి రెస్పాన్స్ గా "డే.. డోంట్ గివ్ మీ ఎక్స్ పెక్టేషన్స్ డా..(ఒక నవ్వలేక చచ్చిపోతున్న ఎమోజి)". అంటే మీరు అంటున్నట్టుగా ఏమీలేదని ఫ్యాన్స్ తో చెప్పినట్టే. దాంతో పాటు మీరు నాకు లేనిపోని ఆశలు కల్పించొద్దని క్లారిటీ ఇచ్చేసింది. సహజంగా ఇలాంటి రూమర్లకు.. స్పెక్యులేషన్లకు హీరోయిన్లు రెస్పాండ్ కారు. అలాంటిది ఫన్నీ రెస్పాన్స్ ఇవ్వడంతో నెటిజనులు రష్మిక చలాకీతనానికి ఫిదా అయ్యారు.

కొంతమంది నిజంగానే విజయ్-అట్లీ సినిమాలో రష్మిక ను హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని అన్నారు. అంతా బాగానే ఉంది మధ్యలో ఒక అభిమాని రష్మిక కు రిప్లై ఇస్తూ 'జై బాలయ్య' అన్నాడు. ఇంతకీ ఆ అభిమానికి ఏం అర్థం అయిందో.. ఎందుకు జై బాలయ్య అన్నాడో!