గుడ్ బై అందుకే..రష్మిక మందన్న క్లారిటీ

Mon Sep 17 2018 15:16:28 GMT+0530 (IST)

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు.. ఇప్పుడీ నానుడిని అక్షరాల పాటిస్తూ దూసుకుపోతోంది హీరోయిన్ రష్మికా మందానా. ప్రస్తుతం రష్మికా ఫుల్ స్వింగ్ లో ఉంది. ‘గీతా గోవిందం’ హిట్ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ అయ్యేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. డబ్బు - పేరు - పరపతి మూడు వస్తుండడంతో అనవసరంగా పెళ్లి చేసుకొని వీటన్నింటిని మిస్ కాకూడదని నిర్ణయించుకుంది. అందుకే ఇప్పుడు రష్మిక ఫుల్ ఫోకస్ మొత్తం కెరీర్ మీదే పెట్టింది. అందుకే కన్నడ హీరోతో చేసుకున్న ఎంగేజ్ మెంట్ ను కూడా రద్దు చేసుకొని హీరోయిన్ గా చేస్తోంది.తాజాగా ఓ కన్నడ చిత్రం నుంచి కూడా రష్మిక మందానా వైదొలిగిందనే వార్తలొచ్చాయి. దీనిపై రష్మికనే నేరుగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘కన్నడలో తాను ఒప్పుకున్న ‘వ్రిత్రా’ అనే సినిమా నుంచి వైదొలిగాను. ఆ చిత్రంలో నటించకూడదని నిర్ణయించుకున్నాను. కెరీర్ ఆరంభంలో ఇలాంటి చిత్రం చేయకూడదని వైదొలుగుతున్నాను’ అంటూ పేర్కొన్నారు. ఈ విషయాన్ని దర్శకుడు - నిర్మాతకు కూడా వెల్లడించానని తెలిపారు. వారు కూడా ఒప్పుకున్నారని రష్మిక సంతోషం వ్యక్తం చేసింది.

అయితే రష్మిక ఆ సినిమానుంచి వైదొలుగుతున్నానని మాత్రమే వెల్లడించింది. అందుకు గల కారణాలు మాత్రం తెలుపులేదు. వ్రిత్రా అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రచేయడానికి తనకు ధైర్యం లేదని ఇలా చేశానని ఆమె సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించిందట.. కానీ దానికి అసలు కారణం వేరే ఉందంటున్నారు. వ్రిత్రా దర్శకుడు గౌతమ్ - తను ప్రేమించిన రక్షిత్ శెట్టి క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్లే మళ్లీ పాత సంబంధాలు పునరుద్దరించబడతాయనే సాకుతోనే రష్మిక ఆ సినిమా నుంచి వైదొలిగిందనే వార్తలు కన్నడ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.