Begin typing your search above and press return to search.

భలే ఛాన్స్ కొట్టేసిన ఛలో పాప

By:  Tupaki Desk   |   18 March 2018 9:20 AM GMT
భలే ఛాన్స్ కొట్టేసిన ఛలో పాప
X
కన్నడ కిరిక్ పార్టీతో ఒక్క సినిమాతో తన రేంజ్ అమాంతం పెంచుకున్న హీరొయిన్ రష్మిక మండన్నకు టాలీవుడ్ లో మొదటి అడుగు ఛలోతో గట్టిగానే పడింది. నిజానికి కిరిక్ పార్టీ తెలుగు రీమేక్ కిరాక్ పార్టీలో కూడా తనే నటించాల్సి ఉంది. కాని కాల్ షీట్స్ సమస్య వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకోవడంతో అది కాస్త సిమ్రన్ పరీన్జాను వరించింది. అయినా రష్మికకు వచ్చిన నష్టమేమి లేదు. ఛలో తెచ్చిన పేరు అవకాశాలు కూడా రాబడుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు నాగార్జున-నాని కాంబోలో రూపొందుతున్న మల్టీ స్టారర్ లో రష్మిక మండన్న ఒక హీరొయిన్ గా సెలెక్ట్ అయినట్టు సమాచారం. ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. చిన్న సినిమాలు ఎన్ని చేసినా స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్ట్ లో చేస్తే ఆ కిక్కే వేరు.

భలే మంచి రోజు, శమంతకమణితో టిపికల్ సబ్జక్ట్స్ ని హ్యాండిల్ చేయగలడు అని పేరు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీని అశ్వినిదత్ నిర్మిస్తున్నారు.రష్మిక మండన్నను నానికి జోడిగా సెట్ చేసినట్టు తెలిసింది. నాని ఈ మధ్య అందరు కొత్త హీరొయిన్లను పడుతున్నాడు. ఒకసారి చేసిన హీరొయిన్ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. నివేదా థామస్ మాత్రమే జెంటిల్ మెన్ తో పాటు నిన్ను కోరిలో కనిపించింది. ఇప్పుడు నానితో రష్మిక అంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఫ్రెష్ గా ఫీలవుతారు. కన్నడలో బిజీగా ఉన్నప్పటికీ రష్మిక కన్ను టాలీవుడ్ మీద ఉందట . ఇక్కడ కనక పేరు తెచ్చుకుని సెటిల్ అయిపోతే అవకాశాలు, ఆదాయం రెండూ పుష్కలంగా ఉంటాయి కనక వచ్చిన ఆఫర్స్ ని జాగ్రత్తగా వడబోసే పనిలో ఉందట రష్మిక మండన్న. అంతే ఒక్క హిట్టు బొమ్మ హీరొయిన్ దశను మార్చడం అంటే ఇదే.