ఈ ఓవరాక్షనే తగ్గించుకో..

Wed Jun 20 2018 22:47:36 GMT+0530 (IST)

సోషల్ మిడియలో సినీ తారలు సెటైర్లు వేసుకునేది చాలా తక్కువ. పర్సనల్ గా కలుసుకున్నప్పుడు ఎంత ఫ్రెండ్లి గా సెటైర్లు వేసుకున్నప్పటికి సోషల్ మిడియలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే మ్యాటర్ మళ్ళీ రివర్స్ అవుతుంది. అసలే కొన్ని మిడియాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కువవుతున్నాయి.ఏ న్యూస్ లేకపోతే న్యూసెన్స్ క్రియేట్ చేసి మరి తరాలకు బ్యాడ్ నేమ్ ఫ్రీ గా ఇచ్చేస్తుంటారు. అయితే పరిహాసలు అర్థమయ్యేలా ఉంటే అందరు పాజిటివ్ గా ఎంజాయ్ చేస్తారు అని విజయ్ దేవరకొండ మరోసారి నిరూపించాడు. అసలే ఈ హీరో మంచి సెటైర్లు వేయడంలో చాలా గడసరి. ఇకపోతే ఇటీవల విజయ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫెర్ అవార్డు అందుకున్నాడు. అందుకు తనతో నటించిన గీత గోవిందం హీరోయిన్ రష్మీక మందాన విషెస్ అందించగా.. విజయ్ ఫన్నీ గా ఓ ట్వీట్ చేశాడు.

మేడమ్ గీతా మేడమ్.. మీతో టైమ్ గడపడం నాకు నిజమైన అవార్డ్ మేడమ్. ఇవ్వి వస్తుంటాయి పోతుంటాయి అనే చెప్పగా... ఇగో గోవిందం ఈ ఓవరాక్షనే తగ్గించుకోమన్నది. అసలు నీకు కాదు. ప్రభాస్ కో తారక్ కో ఇస్తే మాకు ఈ గొడవ పోయేది అంటూ రష్మీక బలే చెప్పేసింది. ఇక ఇద్దరు గీత గోవిందం క్యారెక్టర్స్ లో ఉన్నారని అందరికి అర్థమైపోయింది.