Begin typing your search above and press return to search.

హలో హీరోకి ఛలో భామ.. కాని

By:  Tupaki Desk   |   16 April 2018 5:22 AM GMT
హలో హీరోకి ఛలో భామ.. కాని
X
కన్నడ భామ రష్మిక మందనకు.. ఇప్పుడు టాలీవుడ్ లో టైం స్టార్ట్ అయినట్లుగా ఉంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంటే.. ఇక ఆ హీరోయిన్ కోసం టాలీవుడ్ మేకర్స్ బాగానే వెంటబడుతుంటారు. ఛలో అంటూ నాగశౌర్యతో చేసిన మూవీలో.. తన నటనతో కూడా మెప్పించిన రష్మికకు.. ఇప్పుడు తెలుగు నుంచి తెగ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి.

వరుసగా బోలెడన్ని ప్రాజెక్టులు తన దగ్గరకు వస్తున్నా.. ఏరి కోరి మాత్రమే సినిమాలను ఎంపిక చేసుకుంటోంది రష్మిక మందన. నానితో ఒక సినిమాకు.. విజయ్ దేవరకొండతో ఒక చిత్రానికి రష్మిక చేసిందని ఇప్పటికే వార్తలు ఉన్నాయి. ఇలా ఇద్దరు జోరు మీదున్న హీరోలతో మూవీస్ చేస్తున్న ఈమె.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టును కూడా ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా ఓ ప్రాజెక్టు ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాలంటూ.. రీసెంట్ గా దర్శకుడు రష్మికను అప్రోచ్ అయ్యాడట.

ఆమె క్యారెక్టర్ గురించిన నెరేషన్ విపరీతంగా నచ్చడం.. అక్కినేని హీరోతో సినిమా చేయడం అనే పాయింట్స్ ఆకర్షించడంతో వెంటనే అంగీకరించిందట. కానీ అఖిల్ మూవీ కోసం అడిగిన డేట్స్.. విజయ్ దేవరకొండ మూవీకి కేటాయించిన కాల్షీట్స్ మధ్య క్లాష్ వచ్చిందట. అక్కడే ఇప్పుడు డిస్కషన్స్ ఆగినట్లుగా తెలుస్తోంది. ఇవి సెట్ అయిపోతే.. హలో హీరో అయిన అఖిల్ తో ఛలో హీరోయిన్ రష్మిక మందన సినిమా ఖాయం అయినట్లే.