Begin typing your search above and press return to search.

గోవిందుడి కోసం గీత ఇలా..

By:  Tupaki Desk   |   6 Jan 2019 10:32 AM GMT
గోవిందుడి కోసం గీత ఇలా..
X
'ఛలో'.. 'గీత గోవిందం' సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక మందన్న 'దేవదాస్' తో కాస్త నిరశాపరిచింది. కానీ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' లాంటి క్రేజీ ప్రాజెక్టు లైన్లో ఉంది. 'గీత గోవిందం' లో హీరో హీరోయిన్లుగా నటించిన విజయ్ - రష్మిక జంట మరోసారి రిపీట్ కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి భారీగానే ఉంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపిస్తుండగా.. రష్మిక క్రికెటర్ పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రను రియాలిటికి దగ్గరగా ఉండేలా పోషించేందుకు క్రికెట్ ట్రైనింగ్ కూడా తీసుకొని ప్రాక్టిస్ సెషన్స్ హాజరయ్యిందట. అంతటితో ఆగకుండా తన లాంగ్ హెయిర్ ను కట్ చేసుకొని షార్ట్ హెయిర్ తో కనిపించేందుకు రెడీ అయిందట. సహజంగా హీరోయిన్ తమ జుట్టును కట్ చేసేందుకు ఒప్పుకోరు. లుక్ ఎలా ఉంటుందో అనేది ఒక భయమైతే.. మళ్ళీ ఆ జుట్టు పొడవుగా పెరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. కానీ రష్మిక మాత్రం అవన్నీ పట్టించుకోకుండా షార్ట్ హెయిర్ కు ఒకే చెప్పేసి లుక్ మార్చింది.

గీత గా విజయ్ దేవరకొండను ఏడిపించిన రష్మిక ఈ సారి క్రికెటర్ గా ఏం చేస్తుందో వేచి చూడాలి. డెబ్యూ డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కాకినాడ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రీసెంట్ గా 'డియర్ కామ్రేడ్' టీమ్ ఒక లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చింది.