Begin typing your search above and press return to search.

గీత అప్పుడే బాలీవుడ్ లోనూ పాగా?

By:  Tupaki Desk   |   25 April 2019 5:36 AM GMT
గీత అప్పుడే బాలీవుడ్ లోనూ పాగా?
X
ఛ‌లో.. గీత గోవిందం చిత్రాల‌తో త‌న స్థానాన్ని టాలీవుడ్ లో ప‌దిలం చేసుకుంది క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న‌. మ‌రో నాలుగైదేళ్లు కెరీర్ ప‌రంగా డోఖా లేనంతగా బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుని.. ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో `డియ‌ర్ కామ్రేడ్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మెగా కాంపౌండ్.. అక్కినేని కాంపౌండ్ హీరోల‌తోనూ ర‌ష్మిక అవ‌కాశాలు అందుకుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు అటు త‌మిళంలోనూ ర‌ష్మిక రంగ ప్ర‌వేశం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ర‌ష్మిక తొంద‌ర్లోనే బాలీవుడ్ లోనూ అడుగుపెడుతోంది. అది కూడా సంజ‌య్ లీలా భ‌న్సాలీ లాంటి క్లాసిక్ డైరెక్ట‌ర్ ఏరి కోరి ర‌ష్మిక‌ను ఓ సినిమా కోసం ఎంపిక చేసుకున్నార‌ని తెలుస్తోంది. `ప‌ద్మావ‌త్` లాంటి క్లాసిక్ మూవీ త‌ర్వాత‌ భ‌న్సాలీ చాలా గ్యాప్ తీసుకుని ఓ భారీ చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ర‌ణ‌దీప్ హుడా ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు. అత‌డి స‌ర‌స‌న ర‌ష్మిక‌ను క‌థానాయిక‌గా ఎంపిక చేసుకున్నార‌ని.. అయితే ఇంకా డీల్ చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం భ‌న్సాలీ అందించిన స్క్రిప్టు చ‌దువుతోంది ర‌ష్మిక‌. ఇంకా ఓకే చెప్పాల్సి ఉంది. స్క్రిప్టు ప్ర‌కారం.. ఇదో థ్రిల్ల‌ర్ సినిమా. టైటిల్ ఇంకా ఖారారు కాలేదు. అన్నీ అనుకూలిస్తే ఆగ‌స్టు నుంచి సెట్స్ పైకి వెళ‌తార‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ర‌ష్మిక జాక్ పాట్ కొట్టేసిన‌ట్టే. భ‌న్సాలీ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ పిలిచి అవ‌కాశం ఇస్తానంటే కాద‌ని అన‌గ‌ల‌దా? ఇండియాలోనే ది బెస్ట్ ద‌ర్శ‌కుల్లో ఆయ‌న ఒక‌రిగా ఖ్యాతి ఘ‌డించారు. భారీ బ‌డ్జెట్ల‌తో అద్భుత‌ క‌ళాఖండాల్ని తెర‌కెక్కించే ఆయ‌న ఈ ఆఫ‌ర్ ఇస్తానంటే కాద‌న‌డం మూర్ఖ‌త్వమే అవుతుంది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే రైట్ చాయిస్ అని ర‌ష్మిక అభిమానులు భావిస్తున్నారు. అయితే ర‌ష్మిక షెడ్యూల్స్ చూస్తుంటే.. కాల్షీట్లు ఇవ్వ‌డం కాస్తంత ఠ‌ఫ్ అనే తాజా స‌న్నివేశం చెబుతోంది. మ‌రి ఓకే చెబుతుందా లేదా అన్న‌ది కాస్త వేచి చూడాల్సిందే.