గీతకు కోలీవుడ్ ఎంట్రీ కూడా దక్కింది

Thu Mar 14 2019 12:02:03 GMT+0530 (IST)

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కిట్టీ పార్టీతో సొంత భాషలో స్టార్ డం దక్కించుకుని అక్కడ నుండి 'ఛలో' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి గీత గోవిందం చిత్రంతో టాలీవుడ్ లో స్టార్ డం దక్కించుకున్న ముద్దుగుమ్మ రష్మీక మందన్న కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో కలిసి కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్దం అయ్యింది. ఒక వైపు తెలుగులో వరుసగా చిత్రాల్లో నటిస్తూ కన్నడంలో కూడా అడపా దడపా చిత్రాలు చేస్తున్న ముద్దుగుమ్మ రష్మిక కోలీవుడ్ ఎంట్రీకి కూడా సై అంది.'రెమో' ఫేం భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాశ్ ఎస్ ఆర్ ప్రభు లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తీకి జోడీగా రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే కార్తీ 'దేవ్' చిత్రంతో వచ్చి నిరాశ పర్చాడు. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా తన తాజా చిత్రం ఖైదీని షూటింగ్ పూర్తి చేశాడు. ఖైదీ షూటింగ్ పూర్తి అయిన వెంటనే కొత్త సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు.

షూటింగ్ ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాల్లో కార్తితో పాటు రష్మిక కూడా పాల్గొంది. యోగి బాబు కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని చెబుతున్నారు. రెమో తరహాలో ఈ చిత్రం కూడా ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుంటుందని తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ చిత్రం సక్సెస్ అయితే రష్మికకు తమిళనాట కూడా మంచి క్రేజ్ దక్కడం ఖాయం. దాంతో కన్నడం తెలుగు తమిళంలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా అరుదైన రికార్డు దక్కించుకునే అవకాశం ఉంది.