గీత మేడమ్ తీసిన గోవిందం సారు ఫోటో

Mon Apr 15 2019 10:34:32 GMT+0530 (IST)

విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.   'గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ మరోసారి రష్మిక మందన్న తో జోడీ కడుతున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా కేరళ షెడ్యూల్ పూర్తయింది.  దీంతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని సమాచారం.  ఇదిలా ఉంటే తాజాగా విజయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో షేర్ చేశాడు."కేరళ సుగామానో?.. ఫోటోగ్రాఫర్ - కామ్రేడ్ రష్మిక మందన్న" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అర్థం అయింది కదా గోవిందం సారుకు గీత మేడమ్ ఫోటో తీసిందన్నమాట.  పై బటన్స్ వేసుకోకుండా వదిలేసిన డార్క్ కలర్ షర్టు.. గాలికి నుదుటిపై పడిన జుట్టు.. లైట్ గా గడ్డం.. మీసాలతో టాలీవుడ్ కామ్రేడ్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు. నేపథ్యంలో జలపాతం ఉండడంతో ఫోటో సూపర్ గా ఉంది.  రష్మిక మంచి నటి అని తెలుసుకానీ ఇలా ఒక మంచి ఫోటోగ్రాఫర్ అని ఈ ఫోటో ద్వారా అందరికీ తెలిసిపోయింది.

డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న 'డియర్ కామ్రేడ్' మే 31 న రిలీజ్ కానుంది. విజయ్ కెరీర్లో తొలిసారిగా ఈ సినిమా నాలుగు సౌత్ భాషలలో ఒకేసారి విడుదల అవుతోంది. 'గీత  గోవిందం' తర్వాత విజయ్ - రష్మిక జంట నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.