Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: మ‌హాన‌టికి చెల్లెలు వ‌రుసా?

By:  Tupaki Desk   |   13 Aug 2018 1:30 AM GMT
ఫోటో స్టోరీ: మ‌హాన‌టికి చెల్లెలు వ‌రుసా?
X

టాలీవుడ్‌ లోకి కొత్త ట్యాలెంటు వ‌ర‌ద‌లా ప్ర‌వ‌హిస్తోంది. ఎక్కే బండి.. దిగే బండి! అన్న‌ట్టు కొంద‌రు వ‌చ్చి వెళుతుంటే, కొంద‌రి కెరీర్‌ ట్రెయిన్ మాత్రం అడ్డూ ఆపూ లేకుండా దూసుకుపోతోంది. ఆ త‌ర‌హాలో ఇటీవ‌లి కాలంలో ఎవ‌రున్నారు? అంటే మ‌ల్లూ భామ‌లదే అగ్ర‌తాంబూలం క‌నిపిస్తోంది. కీర్తి సురేష్‌ - అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ - అనూ ఇమ్మాన్యుయేల్ వంటి భామ‌లు స‌ర్రున దూసుకొచ్చారు. కెరీర్‌ ని అంతే వేగంగా ప‌రుగులు పెట్టించారు. ముంబై భామ‌ల్లో పూజా హెగ్డే - కియ‌రా అద్వాణీ కెరీర్ ప‌రంగా ఎదురే లేకుండా టాలీవుడ్‌ ని షేక్ చేస్తున్నారు.

ఇంత‌మంది మ‌లబారు - ముంబై భామ‌ల మ‌ధ్య బెంగ‌ళూరు బాలిక‌లు మాత్రం పూర్తిగా వెన‌క‌బ‌డిపోయారు. ఇటీవ‌లి కాలంలో బెంగ‌ళూరు - మంగుళూరు భామ‌ల హ‌వా చాలా మేర‌కు త‌గ్గింది. అయితే కాస్తో కూస్తో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌ నుంచి బ‌రిలో దిగిన ర‌శ్మిక మంద‌న ఆశ‌లు పెంచుతోంది. సంజ‌న త‌ర్వాత మ‌ళ్లీ అంత పెద్ద మైలేజ్ ఉన్న క‌ర్నాట‌క‌ బ్యూటీస్ ఎవ‌రూ బ‌రిలో దిగ‌లేదు. కానీ ర‌శ్మిక మాత్రం స‌ర్రున దూసుకొచ్చింది. వ‌చ్చి కూత పెట్టిపోయే రైలు బండిలా కాకుండా కాస్తంత స్టాండార్డ్ వెహిక‌ల్‌ లా ఈ అమ్మ‌డు నాలుగైదు సినిమాలు చేస్తూ టాలీవుడ్‌ లో వేడి పెంచుతోంది. నాగ‌శౌర్య ఛ‌లో చిత్రంలో న‌టించి హిట్టు కొట్టిందో లేదో అలా నిర్మాత‌లు వ‌రుస‌గా అడ్వాన్సులిచ్చి సంత‌కాలు చేయించుకున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న `గీత గోవిందం` చిత్రంలో ర‌శ్మిక న‌టించింది. ఈనెల 14న ఈ సినిమా రిలీజ‌వుతోంది కాబ‌ట్టి ర‌స్మిక ప్ర‌చారంలో జోరుగా పాల్గొంటోంది.

ఇలా ప్రమోష‌న్స్‌ లో పాల్గొన్న ర‌శ్మిక‌ను అభిమానులు కీర్తి సురేష్‌ కు చెల్లెలువా? మ‌హాన‌టికి సిస్ట‌ర్‌ వా అంటూ ఆట‌పట్టిస్తున్నార‌ట‌. మొత్తానికి ర‌స్మిక కెరీర్ ఆరంభ‌మే కీర్తి అంత ఘ‌న‌కీర్తి అందుకుంటోంది. ఆ క‌ళ్లు - ఒడ్డు పొడుగూ అన్నీ కీర్తినే పోలి క‌నిపించ‌డంతో ఇలా కీర్తికి చెల్లెలువా? అని అడిగేసి ఉంటారు. నేటి సాయంత్రం వైజాగ్ ప్రెస్‌ మీట్‌ ఆద్యంతం ర‌శ్మిక హ‌వా సాగింది. బీచ్ సొగ‌సుల విశాఖ ప‌రిస‌రాల్లో ర‌శ్మిక మంద‌న హుషారుగా షికార్లు చేసిందిట‌.