Begin typing your search above and press return to search.

టీజర్‌ టాక్‌: ఎక్కడో తేడా కొడుతోందే

By:  Tupaki Desk   |   24 July 2016 5:42 AM GMT
టీజర్‌ టాక్‌: ఎక్కడో తేడా కొడుతోందే
X
'జాంబీస్' అంటే చచ్చిపోయిన తరువాత.. శవాలు లేచి మళ్లీ తిరుగుతుంటాయి. అవి కొరికితే మనకు కూడా వైరస్ సోకిపోయి.. మనం కూడా అలాగే దెయ్యాల తయారవుతాం. హాలీవుడ్డోళ్ళు ప్రపంచానికి నేర్పిన జాంబీ కల్చర్ అంటే ఇదే. ఒక తొలిసారిగా తెలుగులో జాంబీ కామెడీ తీస్తున్నారు అంటే.. ఈ రేంజులో ఉంటుందనే ఊహిస్తాంగా..

నిన్నే యాంకర్ రష్మీ ప్రధాన పాత్రలో రూపొందిన ''తను వచ్చెనంట'' సినిమా టీజర్ రిలీజైంది. ఈ సినిమాలో రష్మి ఒక జాంబీగా నటిస్తోంది. గుంటూర్ టాకీస్ సినిమా తరువాత ఈ మూవీతో భారీ బ్రేక్ వస్తుందని ఆశిస్తున్న యాంకరమ్మకు టీజర్ తోనే ఇప్పుడు పెద్ ఝలక్ తగిలింది. ఎందుకంటే ఈ టీజర్‌ చూస్తే.. ఇది జాంబీ మూవీ అనాలా లేకపోతే జాంబీ కామెడీ అనాలో ఏమీ అర్ధం కావట్లేదు. కంప్లీట్ గా తేడా కొట్టేస్తున్నట్లు అనిపిస్తోంది.

ఒక్కసారి రాజు గారి గది అనే హారర్‌ కామెడీ బాగా క్లిక్ అయ్యిందని.. వరుసగా అదే సినిమాను రకరకాల యాక్టర్లతో రకరకాల పేర్లతో తీస్తే ఎలా ఉంటుంది? ఈ మధ్యన అలాంటి బాపతులో చాలా సినిమాలు వస్తున్నాయిలే.. అందులో తను వచ్చెనంట సినిమాను కూడా కలుపుకోవాల్సిందే. చూద్దాం సినిమా రిలీజయ్యాక ఎలా ఉండబోతోందో!!