Begin typing your search above and press return to search.

సెక్స్ బాంబుకి.. ఫ్లాపే వచ్చెనంట!!

By:  Tupaki Desk   |   23 Oct 2016 4:35 AM GMT
సెక్స్ బాంబుకి.. ఫ్లాపే వచ్చెనంట!!
X
హీరోయిన్ గా నిలబడేందుకు హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకటే రూట్ ను ఎంచుకుని అదే దారిని ఫాలో అయిపోతోంది. ఈ అందాల ఆరబోతలో అమ్మడికి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవనే విషయం ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసేసింది. తనకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తే.. నాసిరకం సినిమాల్లో కూడా నటించేస్తూ.. తన కెరీర్ ని తనే ప్రమాదంలో పడేసుకుంటున్నట్లుగా ఉంది రష్మీ వాలకం.

గుంటూరు టాకీస్ లో సెక్స్ బాంబ్ గా రెచ్చిపోయి నటించడం.. తెలుగు ఆడియన్స్ లో క్రేజ్ ఉండడంతో వరుసగా సినిమాలు వచ్చి పడ్డాయి. అలాంటివాటిలో ఒకటే ఇప్పుడు రిలీజ్ అయిన తను వచ్చెనంట. జాంబీ కామెడీ అంటూ మేకర్స్ ఏదేదో చాలానే చెప్పారు కానీ.. అవేమీ పెద్దగా అనిపించవు. రష్మీ అందాలు.. రెచ్చిపోయి నటించే ఓ పాట వాటి కోసమే థియేటర్లకు పిలిచారు. అనుకున్నట్లుగానే ఏ మాత్రం ఆకట్టుకోకపోగా.. ఈ సెక్స్ బాంబ్ కెరీర్ లోకి మరో ఫ్లాపే వచ్చి చేరింది.

దీనికి ముందు కూడా రాణి గారి బంగ్లా అనే సినిమాలో దెయ్యంగా భయపెట్టేందుకు ట్రై చేసింది. ఓ సారి అందాలు.. ఓసారి దెయ్యం గెటప్.. కలిసి రాలేదు. అంతం అనే సినిమా చేసి.. ఆ దర్శకుడిపై నిప్పులు చెరిగింది. పబ్లిసిటీ విషయంలో ఆ దర్శకుడు చీటింగ్ చేశాడన్నది అమ్మడి ఆరోపణ. ఎన్ని కబుర్లు చెప్పినా.. ఏ సినిమాతోనూ రష్మీ గౌతమ్ కి సక్సెస్ మాత్రం రావడం లేదు. ఇలాంటి సినిమాలతో రష్మీ ఇంకెన్నాళ్లు పొద్దు పుచ్చుతుందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/