Begin typing your search above and press return to search.

సెక్స్ ఎప్పీల్ ను మించిందేదీ లేదు!!

By:  Tupaki Desk   |   2 Dec 2016 7:30 PM GMT
సెక్స్ ఎప్పీల్ ను మించిందేదీ లేదు!!
X
నిన్న మనం ఆల్రెడీ గుంటూర్ టాకీస్ సినిమాలో రష్మి హాటుగా నటించిన 'నీ సొంతం' పాట గురించి ఒక విశేషం చెప్పుకున్నాం. ఏకంగా ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎక్కువమంది వీక్షించిన వీడియో సాంగ్ గా రేసుగుర్రం సినిమాలోని 'సినిమా చూపిస్తా మావా' పాట పేరిటి ఉంటే.. ఇప్పుడు రష్మీ సాంగ్ ఆ రికార్డును తన్నుకుపోయింది. బన్నీ-శృతిల పాటను 3 సంవత్సరాల్లో 1.9 కోట్ల మంది చూస్తే.. రష్మి పాటను 1 సంవత్సరంలో 2.1 కోట్ల మంది చూశారు. ఈ సందర్భంగా అసలు ఒక సెక్సీ లేడీ సెక్స్ ఎప్పీల్ కు ఉన్న పవర్ ఏంటో మనం తెలుసుకోవాల్సిందే.

మామూలుగా మనం టివిల్లో చూసినా కూడా.. ఒక టైర్ల యాడ్ లో కూడా.. అందంగా ఉన్న ఒక బికినీ లేడీ కనిపిస్తుంది. ఏ సబ్బును తీసుకున్నా కూడా.. అబ్బయికంటే అమ్మాయి బాడీ మీద నురుగునే చాలా హాటుగా చూపిస్తారు. నెలల తరబడి ఆడిషన్లు చేసి.. కత్తిలాంటి మోడళ్లను వెతికి చాక్లెట్ యాడ్లను తీస్తారు. అందుకే యాడ్ ఇండస్ర్టీలో ఒక కామెంట్ వినిపిస్తుంది. 'సెక్స్ సెల్స్' అంటూ వారు చెప్పేది నిజమే మరి. ఎంతో కష్టపడి అల్లు అర్జున్ మరియు శృతి హాసన్ ఎంతో క్లిష్టమైన స్టెప్పులను వేసినా కూడా.. ఆ పాట కంటే ఇప్పుడు రష్మి కేవలం బికినీ టాప్ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లోకి దూకిన వీడియో హిట్టయ్యిందంటే.. సెక్స్ ఎప్పీల్ అనే కారకం ఎంత పనిచేసిందో చూసుకోండి.

అందుకే సినిమా పాటల్లో హీరోయిన్ల అందాలను దారబోయడం.. అలాగే మత్తెక్కించే భంగిమల్లో వారి హావభావాలను క్లోజుగా చూపించడం.. సదరు పోస్టర్లపై అవే అందాలను విరబూయించడం.. ఇవన్నీచేస్తుంటారు మన ఫిలిం మేకర్లు. సొసైటీ అంతా సెక్స్ ఎప్పీల్ కు జోహార్ అంటుంటే.. వీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అందుకే ఫాలో అయిపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/