Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చీరలో రష్మీ సొగసులు

By:  Tupaki Desk   |   19 Jan 2018 11:23 AM GMT
ఫోటో స్టోరి: చీరలో రష్మీ సొగసులు
X
ఈ రోజుల్లో ఉండే యాంకర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాటలు నేర్చిన చిలుక ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో అంత అందంగా ఉంటున్నారు. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా కొంచెం ఘాటుగా కనిపిస్తూ యాంకర్ అనే పదానికి మరో అర్ధాన్ని తెస్తున్నారు. ఆ విధంగా ప్రస్తుతం మోస్ట్ పాపులర్ అవుతోన్న బ్యూటీ రష్మీ. ఈ భామ ఎప్పటి నుండో టాలీవుడ్ లో కోనసాగుతోంది.

కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కానీ పెద్దగా ఫెమాస్ అవ్వలేదు. ఎప్పుడైతే జబర్దస్త్ లో అడుగుపెట్టిందో అప్పుడు యాంకర్స్ కూడా ఇంత సెక్సీ గా ఉంటారా అని అనిపించేలా చేసింది. అంతే కాకుండా అప్పుడప్పుడు ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. ఫ్యాషన్ ప్రపంచంలో స్టైలిష్ గా ఉన్న డ్రెస్సులన్నిటినీ వేసి ఓ వర్గం వారికి చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఫొటో షూట్ లో కూడా అమ్మడు చాలా హాట్ గా కనిపించింది.

వైట్ చీరలో రష్మీ అందాలు చాలా హాట్ గా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా నడుము దగ్గర ఆమె ఉంచిన చేయి పెదవిపై ఓ నవ్వు ఇలా ఒక ఫ్రెమ్ లో ఉండడం చూసి నెటీజన్స్ ఆమె అందాలను వర్ణిస్తున్నారు. ఇలాంటి ఫొటోల వల్ల రష్మీ ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకు చాలా పెరిగిపోతోంది.