Begin typing your search above and press return to search.

ఈ హాటీ కూడా ఐటెంలోకి దిగుతుందా?

By:  Tupaki Desk   |   3 Dec 2016 7:30 AM GMT
ఈ హాటీ కూడా ఐటెంలోకి దిగుతుందా?
X
ఇప్పుడు టాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కంపల్సరీ అయిపోయాయి. స్టార్ హీరో సినిమా నుంచి లో బడ్జెట్ మూవీ వరకూ.. ఎవరైనా సరే ఐటెం సాంగ్ ను మస్ట్ గా ఇరికించేస్తున్నారు. కాకపోతే ఐటెం భామను మాత్రం ఎవరి రేంజ్ కి తగ్గట్లుగా వారు తెచ్చుకుంటున్నారు. ఐటెం డాల్స్ కి డిమాండ్ పెరిగిపోవడంతో.. కొత్త కొత్తోళ్లందరినీ రంగంలోకి దిగాల్సి వస్తోంది.

సాయిధరం తేజ్ నటించిన విన్నర్ మూవీ కోసం ఇప్పటికే హాట్ యాంకర్ అనసూయను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కు కూడా ఇదే ఆఫర్ వెళ్లినట్లు తెలుస్తోంది. వంశీకృష్ణ దర్శత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త కోసం రష్మీకి ఆఫర్ పంపారు. అటు యాంకర్ గా.. ఇటు హీరోయిన్ గా రెచ్చిపోతున్న ఈ బ్యూటీ.. ఇలా ఐటెం సాంగ్ చేస్తుందా అన్నది ఆలోచించాల్సిన విషయమే.

అయితే.. సాంగ్స్ విషయంలోను గ్లామర్ షో విషయంలోను పెద్దగా అబ్జెక్షన్స్ లేని ఈ బ్యూటీ.. ఐటెం సాంగ్ చేసేందుకు అభ్యంతరం చెప్పకపోవచ్చని అంచనా. ఒకవేళ రష్మీ కాదంటే.. అప్పుడు మరో ఆప్షన్ చూస్తాడట రాజ్ తరుణ్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/