త్వరలో రష్మి రాసలీలలు లీక్ చేస్తా

Sat Jan 12 2019 11:52:12 GMT+0530 (IST)

జబర్దస్త్ యాంకర్ రష్మీ బుల్లి తెర వెండి తెర అనే తేడా లేకుండా మంచి క్రేజ్ తో దూసుకు పోతుంది. బుల్లి తెరపై జబర్దస్త్ షో తో ఆకట్టుకుంటున్న రష్మీ అప్పుడప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా - ఐటెం సాంగ్స్ ను చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రష్మి తాజాగా ఒక వ్యక్తి నుండి బెదిరింపులను అందుకుంది. సాయి ప్రణీత్ చౌదరి అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా త్వరలోనే తాను రష్మీ రాసలీలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.రష్మీ దీనికి సమాధానంగా చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. ఇలాంటి చెత్త వ్యాఖ్యలను తాను పట్టించుకోనంటూ చెప్పుకొచ్చింది. తన గురించి ఎలాంటి విషయాలను పోస్ట్ చేయాలనుకున్నా చేసేయ్ - నేను వాటి గురించి పట్టించుకోను నేను తప్పు చేయలేదు కనుక తప్పకుండా ధైర్యంగా ముందుకు సాగుతానంటూ పోస్ట్ చేసింది. రష్మీ అభిమాని ఒకరు ఆ పోస్ట్ ను డిలీట్ చేయాల్సిందిగా సాయి ప్రణీత్ చౌదరిని కోరడం జరిగింది. దయచేసి ఆ పోస్ట్ డిలీట్ చేయి భయ్యా - నీకు దండం పెడతానంటూ అతడు రిక్వెస్ట్ చేశాడు.

అభిమాని పోస్ట్ కు స్పందించిన రష్మీ.. ఆ వ్యక్తి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదండి - జస్ట్ అతడిని ఫాలో అవ్వడం మానేయండి అంటూ సలహా ఇచ్చింది. సాయి ప్రణీత్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతడు విడుదల చేస్తానంటున్న వీడియో ఏంటో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొందరు మాత్రం అతడు ఏదో పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా అనుకుంటున్నారు. రష్మీ మాత్రం అతడి బ్లాక్ మెయిల్ ను చాలా లైట్ గా తీసుకుంది.