Begin typing your search above and press return to search.

జబర్దస్త్ బ్యూటీతో రొమాన్స్

By:  Tupaki Desk   |   28 May 2017 5:41 PM GMT
జబర్దస్త్ బ్యూటీతో రొమాన్స్
X
సాయి కుమార్ కొడుకు ఆది కెరీర్ బాగానే స్టార్ట్ అయినా.. ఆ తర్వాత మాత్రం ఆ జోష్ కొనసాగించలేకపోయాడు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఈ కుర్ర హీరో.. వరుస ప్రయత్నాలతో జనాలను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతేడాది మాస్ హీరోగా మారదామనే తాపత్రయంతో తీసిన గరం.. చుట్టాలబ్బాయి ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఓ సూపర్బ్ ఆఫర్ ఆదికి దక్కింది.

సినిమాల్లో చిన్న వేషాలతో కెరీర్ స్టార్ట్ చేసి.. బబర్దస్త్ టీవీ షోతో హాట్ బ్యూటీ అనిపించుకున్న రష్మీ గౌతమ్.. గుంటూరు టాకీస్ మూవీతో హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఆది.. రష్మీ ఇద్దరూ కలిసి ఓ మూవీలో రొమాన్స్ చేయనున్నారు. ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ కోసం ఈ కాంబినేషన్ ను ఫైనల్ చేశారు. హారర్ కామెడీ జోనర్ లో ఈ మూవీ రూపొందుతుండగా.. ఇప్పటికే ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుగుతోంది కూడా.

ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ మూవీలో చాలానే యాంగిల్స్ ఉంటాయని అంటున్నారు. హారర్.. కామెడీలతోపాటు.. రొమాన్స్ డోస్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని.. అందుకోసమే రష్మీ లాంటి హాట్ బ్యూటీని ఎంచుకున్నారని అంటున్నారు. గీతా ఆర్ట్స్2.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతుండడం విశేషం. మొదటగా ఈ సినిమాలో అల్లు శిరీష్ హీరోగా నటిస్తాడనే టాక్ వినిపించింది కానీ.. చివరకు ఆదిని ఫిక్స్ చేయడం విశేషం.