Begin typing your search above and press return to search.

కొత్త జోనర్ తో వస్తున్న హాట్ యాంకర్

By:  Tupaki Desk   |   27 May 2017 5:43 AM GMT
కొత్త జోనర్ తో వస్తున్న హాట్ యాంకర్
X
హట్ యాంకర్ రష్మీ గౌతమ్ కు కామెడీ చేయడం కొత్తేమీ కాదు. జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో అంటూ సాగే నవ్వుల టీవీ ప్రోగ్రామ్ కి యాంకర్ ఈ భామ. కమెడియన్స్ జోకులకు నవ్వడంతో పాటు తాను కూడా నవ్వులు పూయిస్తూ ఉంటుంది. ఇప్పుడీ బ్యూటీ ఓ కామెడీ రోల్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైపోతోంది.

గుంటూరు టాకీస్ అంటూ అడల్ట్ కామెడీ మూవీలో హీరోయిన్ పాత్రతో అలరించింది రష్మీ. ఇదేమీ ఆమెకు తొలి చిత్రం కాకపోయినా.. గుంటూరు టాకీస్ ఈమెకు సంథింగ్ స్పెషల్. రష్మీ అందాలే పెట్టుబడిగా ఈ మూవీని తీశారు.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. ఆ తర్వాత అంతం అంటూ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కనిపించింది. ఆ వెంటనే తను వచ్చెనంట అంటూ జాంబీ మూవీలోనూ సందడి చేసిన రష్మీ.. ఇప్పుడు కామెడీ జోనర్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో కామెడీ రోల్ చేస్తోంది ఈ హాట్ యాంకర్.

ఫన్ తో పాటు హారర్ ఎలిమెంట్స్ కూడా ఫుల్లుగా ఉండే ఈ చిత్రంలో.. రష్మీ చేసే కామెడీ హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. హారర్ కామెడీ జోనర్ లో రూపొందుతున్న ఈ మూవీపై ఇన్ సైడ్ రిపోర్టులు చాలా బాగుండడం విశేషం. యూవీ క్రియేషన్స్.. గీతా ఆర్ట్స్ లు సంయుక్తంగా ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ కూడా హై లెవెల్ లోనే ఉన్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/