Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ ని బుట్టలో వేస్తున్న రాశీ

By:  Tupaki Desk   |   4 Aug 2015 8:22 AM GMT
ఎన్టీఆర్‌ ని బుట్టలో వేస్తున్న రాశీ
X
స్లో అండ్‌ స్టడీ .. విన్స్‌ ది రేస్‌.. అన్న చందంగా సాగుతోంది బొద్దుగుమ్మ రాశీ ఖన్నా కెరీర్‌. ఈ భామ గ్రాఫ్‌ ని పెంచుకునే పనిలో ఉందిప్పుడు. మాస్‌ మహారాజ్‌ రవితేజ సరసన బెంగాళ్‌ టైగర్‌ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది. అలాగే ఓ చిత్రంలో పోలీస్‌ క్యారెక్టర్‌ కి సంతకం చేసింది. ఈలోగానే ఎన్టీఆర్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న మా నాన్నకు ప్రేమతో చిత్రంలో ఐటెమ్‌ భామగా నర్తించేందుకు సంతకం చేసింది. కెరీర్‌ కి ఈ ఐటెమ్‌ నంబర్‌ పెద్ద ప్లస్‌ అవుతుందని ఈ భామ భావిస్తోంది.

ఇటీవలి కాలంలో స్టార్‌ హీరోలు ఐటెమ్‌ నంబర్‌ లో అవకాశం ఇచ్చి ఆ తర్వాత తమ సినిమాల్లో పూర్తి నాయికగా ఓ ఛాన్సిస్తున్నారు. మహేష్‌ ఆగడులో ఐటెమ్‌ నంబర్‌ లో నర్తించిన శ్రుతిహాసన్‌ ఆ తర్వాత శ్రీమంతుడు లో ప్రధాన నాయిక గా అవకాశం అందుకుంది. అదే తీరుగా ఎన్టీఆర్‌ ని బుట్టలో వేయడానికి ఈ ఐటెమ్‌ కి రాశీ అంగీకరించిందన్నమాట! మా నాన్నకు ప్రేమతో ఆడియో ఈ నెల 27న రిలీజవుతోంది. ఎన్టీఆర్‌ అభిమానుల మధ్య ఘనంగా ఆడియో వేడుక నిర్వహిస్తున్నారు. రాశీ ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ కావడం ఖాయం.