Begin typing your search above and press return to search.

సినిమా హిట్టు.. చేతిలో సినిమా లేదు

By:  Tupaki Desk   |   31 May 2016 9:30 AM GMT
సినిమా హిట్టు.. చేతిలో సినిమా లేదు
X
బాలీవుడ్ హాట్ హీరోయిన్ కెరీర్లో మొన్నటిదాకా చెప్పుకోదగ్గ హిట్టు ఒకటి కూడా లేదు. అయినా ఆమెకు అవకాశాలకు కొదవ లేకుండా ఉండేది. ఐతే ‘నీర్జా’తో ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాక ఆమెకు ఉన్నట్లుండి ఛాన్సులు ఆగిపోయాయి. ఇక్కడ మన రాశి ఖన్నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి మంచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రాశికి.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ అందులో ఒక్కటీ సరైన హిట్ అవ్వలేదు. ఐతే అవకాశాలకు మాత్రం కొదవలేకపోయింది.

ఇప్పుడు ‘సుప్రీమ్’ రూపంలో కెరీర్లోనే పెద్ద హిట్ అందుకుంది రాశి. ఇందులో రాశి పెర్ఫామెన్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐతే ఆమెకు ప్రస్తుతం చేతిలో ఒక్క అవకాశం కూడా లేకపోవడం విడ్డూరం. గోపీచంద్ సరసన ‘ఆక్సిజన్’ సినిమా ఆల్రెడీ పూర్తయిపోయింది. కొత్తగా ఇంకే సినిమా ఒప్పుకోలేదు రాశి. రవితేజతో ‘రాబిన్ హుడ్’లో ఛాన్స్ అన్నారు కానీ.. అదేమీ కన్ఫమ్ కాలేదు.

మొత్తానికి హిట్టు కొట్టినా అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది రాశి. పోటీలో ఉన్న హీరోయిన్లలో ఉన్న ఛార్మ్.. గ్రేస్.. రాశిలో లేదన్న విమర్శలున్నాయి. అందుకు ఆమె బరువే ప్రధాన కారణం. ఆమె బొద్దుతనం వల్లే ఒక స్థాయికి మించి ఎదగలేకపోతోందనే విమర్శలున్నాయి. ‘సుప్రీమ్’లో సైతం సాయిధరమ్ పక్కన అదోలాగే కనిపించింది రాశి. అర్జెంటుగా ఆమె బరువు తగ్గి.. నాజూగ్గా తయారైతే తప్ప కెరీర్ ఎంతో కాలం కొనసాగడం కష్టమేమో.