Begin typing your search above and press return to search.

రాశీఖన్నా పెళ్లి కలలివి!

By:  Tupaki Desk   |   20 Jan 2017 9:57 AM GMT
రాశీఖన్నా పెళ్లి కలలివి!
X
కాస్త సీనియార్టీ వచ్చిన హీరోయిన్స్ కి సాధారణంగా ఎదురయ్యేవాటిలో రెండు ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. వాటిలో ఒకటి... మీ వయస్సెంత? ఇది అడగకూడని ప్రశ్న! ఇక రెండోది... మీ పెళ్లెప్పుడు! వీటిలో రెండో ప్రశ్న అడిగితే తప్పకుండా మొదటి ప్రశ్న పరోక్షంగా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రెండో ప్రశ్నకు సమాధానంగా... "అప్పుడే నాకు పెళ్లేంటి" అని తమదైన శైలిలో చెబుతుంటారు కథానాయికలు. అయితే ఈ విషయంలో కథానాయికలందు ఈ కథనాయిక వేరన్నట్లుగా స్పందిస్తుంది రాశీఖన్నా!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న ముద్దుగుమ్మ రాశీఖన్నా... తాజాగా తన పెళ్లి విషయంపై స్పందించింది. అయితే.. ఈ విషయంలో ఎవ్వరూ ఊహించని రీతిలో స్పందించిన రాశీ... తనకు రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాలని ఉండేదని తెలిపింది. దీనికి కారణాలను బాల్యంతో ముడిపెట్టి చెప్పిన రాశీ... తనకు చిన్నప్పటినుంచీ పెళ్లికి సంబందించి అనేక కలలు ఉండేవని, అందులో భాగంగా తనకు 22 ఏళ్లు ముగిసి 23వ ఏట అడుగుపెట్టగానే పెళ్లి చేసుకోవాలని భావించేదాన్నని చెబుతుంది. అలాగే... చిన్నప్పటి పెళ్లి ఆలోచనల సంగతులు ఇప్పుడు తలచుకుంటే తెగ నవ్వొస్తుందని చెబుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతానికి కెరీర్ తప్ప మరో ఊసే లేదని తేల్చి చెప్పేస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/