Begin typing your search above and press return to search.

నార్వే మంచుకొండల్లో అందాల రాశి

By:  Tupaki Desk   |   26 Aug 2015 11:26 AM GMT
నార్వే మంచుకొండల్లో అందాల రాశి
X
ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి శివంలో జంటగా నటిస్తోంది రాశిఖన్నా. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు నిర్మాత స్రవంతి రవికిషోర్. ఈ మూవీకి సంబంధించిన టాకీపార్ట్ షూటింగ్ పూర్తయిపోగా... ఇప్పుడు పాటల చిత్రీకరణలో ఉంది చిత్రబృందం.

ప్రస్తుతం రామ్, రాశిఖన్నాలు నార్వే అందాల్లో రొమాన్స్ చేసుకుంటున్నారు. అదేనండీ నార్వే కొండల నడుమ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ లో ఫుల్ బిజగా ఉన్నారు. ఈ నెలాఖరు వరకూ నార్వే, స్వీడన్‌ లలో మొత్తం 3 పాటలు షూటింగ్ పూర్తి చేస్తారట.

ఇదో హై ఓల్టేజ్ లవ్ స్టోరీ అని... తనది మంచి కేరక్టర్ అంటున్నారు రామ్. డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని రామ్ చెబ్తుంటే... నార్వే అందాలు అదుర్స్ అంటోంది రాశి ఖన్నా. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేయనుండగా.. రామ్ ఎనర్జీకి తగ్గ పాటలను డీఎస్పీ ఇచ్చాడంటున్నారు యూనిట్. స్టిల్స్ చూస్తుంటే... 'శివం'గా రామ్ రెచ్చిపోతున్నట్లుగానే ఉంది.