Begin typing your search above and press return to search.

రాశీ ఖన్నా.. అభినవ విజయశాంతి

By:  Tupaki Desk   |   4 Aug 2015 5:22 AM GMT
రాశీ ఖన్నా.. అభినవ విజయశాంతి
X
పోలీస్‌ క్యారెక్టర్‌ కి అర్థం పరమార్థం తెచ్చిన కథానాయికగా విజయశాంతికి పేరుంది. 'కర్తవ్యం' సినిమాలో లేడీ అమితాబ్‌ విజయశాంతి పెర్ఫామెన్స్‌ ఇప్పటికీ చర్చల్లోకొస్తుంటుంది. ఆ తర్వాత మాలాశ్రీ పోలీస్‌ పాత్రల్లో పాపులర్‌ అయ్యింది. మధ్యలో కొంతమంది కథానాయికలు ప్రయత్నించినా గొప్ప గుర్తింపేమీ రాలేదు.

ఇటీవలి కాలంలో దృశ్యం సినిమాలో సీనియర్‌ నటి నదియా పోలీస్‌ పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఓ గ్లామర్‌ డాళ్‌ ఇమేజ్‌ ఉన్న కథానాయిక పోలీస్‌ పాత్రలో కనిపించిందే లేదు. లేటెస్టుగా నవతరం కథానాయిక రాశీ ఖన్నా ఆ అరుదైన ఫీట్‌ వేస్తోంది. కాప్‌ డ్రెస్‌ లో మతులు చెడగొట్టేందుకు ఈ అమ్మడు రెడీ అవుతోంది.

ఇండిపెండెంట్‌ గాళ్.. లవర్‌ గాళ్‌.. గ్లామర్‌ డాళ్‌.. గాళ్‌ నెక్స్ట్‌ డోర్‌.. ఇలాంటి పాత్రల్లో మెప్పించిన రాశీ ఖన్నా .. తాజా చిత్రంలో కాప్‌ క్యారెక్టర్‌ లో కనిపించి సర్‌ ప్రైజ్‌ ఇవ్వబోతోంది. తన పాత్ర కోసం హాలీవుడ్‌ సినిమాలు చూస్తూ ఆహార్యంలో బెటర్‌ మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నానని రాశి చెప్పింది. మిస్‌ కాంగినియాలిటీ, బ్లూ మై మైండ్‌ (శాండ్రా బుల్లక్‌) వంటి సినిమాలు చూశాను. ఈ చిత్రాల్లో నటీమణుల ఆహార్యాన్ని అడాప్ట్‌ చేసుకుంటున్నానని రాశీ చెప్పింది.

ఈ అమ్మడు ప్రస్తుతం ఓ రెండు సినిమాల్లో నటించేందుకు సంతకం చేసింది. తమిళంలోనూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పింది.