Begin typing your search above and press return to search.

రాశీకి వరుసగా మూడు.. బ‌ర్త్ డే గిఫ్ట్‌

By:  Tupaki Desk   |   30 Nov 2015 1:30 PM GMT
రాశీకి వరుసగా మూడు.. బ‌ర్త్ డే గిఫ్ట్‌
X
ఊహ‌లు గుసగుస‌లాడే సినిమాతో హిట్టు కొట్టిన‌ప్పుడు ఊహించి ఉండ‌దు. టాలీవుడ్‌ లో త‌న‌కి ఇంత పెద్ద కెరీర్ ఉంటుంద‌ని. తెలుగు ప్రేక్ష‌కులు మెచ్చారు. అభిమానించారు. ప‌రిశ్ర‌మ‌ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించింది. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న వెంట ప‌డుతున్నారు. .. ఇవేవీ ఊహ‌కైనా అంది ఉండ‌దు. ఊహ‌లో అయినా ఊహించ‌నివి ఇవ‌న్నీ. అనుకోనిది జ‌రిగితే అదే జీవితం.. అంటారు. ఇంత‌మంది స్టార్లు ఉన్న ఈ ప్ర‌పంచంలో త‌న‌కి కూడా చోటు ద‌క్కింది. అందుకే త‌న‌ని తాను మెరుగులు దిద్దుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తూ తెలివైన ఎంపిక‌ల‌తో స్టార్ స్టాట‌స్‌ ని అందుకుంటోంది.

ఇప్ప‌టికిప్పుడు బొద్దుగుమ్మ రాశీ ఖ‌న్నా మూడు సినిమాల్లో న‌టిస్తోంది. ర‌వితేజ - సాయిధ‌ర‌మ్‌ - గోపిచంద్ లాంటి ఎన‌ర్జిటిక్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంది. ర‌వితేజ స‌ర‌స‌న న‌టించిన బెంగాల్ టైగ‌ర్ ఈ డిసెంబ‌ర్‌ లోనే రిలీజ్‌ కి వ‌స్తోంది. ఈలోగానే జిల్ సినిమాతో త‌న‌కి హిట్టిచ్చిన గోపిచంద్ స‌ర‌స‌న మ‌రో ఛాన్స్ కొట్టేసింది. ఆ శుభ‌వార్త తో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న సుప్రీమ్ మూవీలో న‌టిస్తున్నాన‌ని చెప్పింది. ఏ కోణంలో చూసినా రాశీ ఇప్పుడు మూడు క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీ. అందుకే ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌రుపుకునే పుట్టిన‌రోజు వేరు. ఈ ఏడాది పుట్టిన‌రోజు వేరు అని చెబుతున్నాం. ఈరోజు త‌న‌కి ఎంతో స్పెష‌ల్ డే - స్పెష‌ల్ బ‌ర్త్ డే. త‌న జీవితంలో ఊహించ‌నంత ప్ర‌త్యేక‌మైనది. ఆల్ ది బెస్ట్ టు యువ‌ర్ ఫ్యూచ‌ర్ రాశీ.