Begin typing your search above and press return to search.

సుప్రీమ్ ఫిగ‌ర్ అదిరింది

By:  Tupaki Desk   |   8 Oct 2015 5:50 AM GMT
సుప్రీమ్ ఫిగ‌ర్ అదిరింది
X
ప్ర‌తీ సినిమాలోనూ చిట్టి పొట్టి డ్రెస్సులేసుకొని క‌ల‌ర్‌ ఫుల్‌ గా క‌నిపించే బొద్దుగుమ్మ రాశిఖ‌న్నా ఇప్పుడు ఖాకీ క‌ట్టింది. చేతిలోకి లాఠీ తీసుకొంది. అదంతా సుప్రీమ్ కోస‌మే. మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం సుప్రీమ్‌. ప‌టాస్ ఫేమ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రాశిఖ‌న్నా హీరోయిన్‌ గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆమె పోలీసు పాత్ర‌లో సందడి చేయ‌బోతోంది.

జిల్‌ - శివ‌మ్‌ లాంటి సినిమాల త‌ర్వాత రాశిఖ‌న్నా న‌టిస్తున్న చిత్ర‌మిది. ఇది ఆమె కెరీర్‌ కి చాలా కీల‌కం. సుప్రీమ్‌ లాంటి సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డంతో శివ‌మ్ లాంటి ఫెయిల్యూర్‌ ని కూడా ఆమె తొంద‌ర‌గా మ‌రిచిపోయింది. ఇప్పుడు సుప్రీమ్‌ తో హిట్టు కొడితేనే ఆమెకి భ‌విష్య‌త్తు, లేదంటే కెరీర్ అయోమ‌యంలో ప‌డ‌టం ఖాయం. కానీ రాశిఖ‌న్నా మాత్రం సుప్రీమ్ చాలా కాన్ఫిడెంట్‌ గా ఉంది. క‌థ‌తో పాటు ఆమె పాత్ర‌ని డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగుంద‌ట‌. ముఖ్యంగా పోలీసు గెట‌ప్‌ పై బాగా ప్రేమ పెంచుకొంది రాశిఖ‌న్నా. ఆ దుస్తుల్లో త‌న‌ని తాను చూసుకొని ఎంత ఆనంద‌ప‌డిపోతోందో! సెట్ లోకి వెళ్లిన తొలిరోజే ఆ గెట‌ప్‌ తో కూడిన ఫొటోల్ని ఫేస్‌ బుక్ ద్వారా షేర్ చేసుకొందామె.

అన్న‌ట్టు సినిమాలో రాశిఖ‌న్నా కూడా యాక్ష‌న్ చేస్తుంద‌ట‌. తొలి రోజే ఆమెపై కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది. ఖాకీ క‌ట్టినా రాశి అందం ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇంకా ఆ టైట్ డ్రెస్సులో ఆమె అందాలు మిడిసిప‌డుతున్నాయి. మ‌రోవైపు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఫుల్ జోష్‌ తో సెట్ లోకి అడుగుపెట్టాడు. ఇటీవ‌ల సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌ తో హిట్టు ల‌భించ‌డంతో సాయిధ‌ర‌మ్ తేజ్‌ లో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ సినిమాతో కూడా హిట్టుకొడితే ఇక మెగాస్టార్‌ కి అభిమానులిచ్చిన సుప్రీమ్ బిరుదు సాయిద‌ర‌మ్ తేజ్ సొంత‌మైపోయిన‌ట్టే.