Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: అమాయకురాలైన రాశి

By:  Tupaki Desk   |   16 Jan 2018 3:21 PM GMT
ఫోటో స్టోరీ: అమాయకురాలైన రాశి
X
ఒకరు వాడిన హిట్ సినిమా టైటిల్స్ ను యువ హీరోలు మళ్ళీ వారి సినిమాలకు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే, బాబాయి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా అయిన తొలి ప్రేమ టైటిల్ ను మరల నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తన రాబోతున్న సినిమాకి పెట్టిన విషయం తెల్సిందే. అప్పట్లో బాక్స్ ఆఫీస్ ను ఒక ఊపు ఊపిన తొలి ప్రేమ టైటిల్ తో వరుణ్ తేజ్ మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ఎదుటకు రాబోతున్నాడు.

వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ చుస్తే ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అన్న విషయం తెలియకనే తెలుస్తోంది. కానీ ఒకే టైటిల్ ను రెండు సార్లు వాడటం వల్ల ప్రేక్షకులు ఆనందించటం పక్కన పెడితే రెండు సినిమాలను ఒకదానితో మరోదాన్ని పోలుస్తారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమాలో హీరో హీరోయిన్లు అయిన పవన్ మరియి కీర్తి రెడ్డి లు తమ ప్రేమకథతో తెలుగు ప్రేక్షకులను సైతం ప్రేమలో పడేలా చేసారు. కానీ వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ లో హీరోయిన్ అయిన రాశి ఖన్నా.. కీర్తి రెడ్డి స్థాయిని చేరుకోగలదా అంటే చేరుకోగలదు అనే అంటున్నారు అభిమానులు.

రీసెంట్ గా రిలీజ్ చేసిన మూవీ పోస్టర్ లో రాశి ఖన్నా కళ్ళజోడు పెట్టుకుని బాటిల్ లో వాటర్ పడుతూ అమాయకంగా చూస్తూ చాలా అందంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు రాశిఖన్నా రోల్ హైలైట్ గా నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా ఫిదా సినిమాతో ఒక రేంజ్ కి వెళ్లిపోయిన వరుణ్ తేజ్ తన తొలి ప్రేమ తో ఆ స్టేటస్ ని నిలుపుకోగలడా? వేచి చూడాల్సిందే మరి.