Begin typing your search above and press return to search.

బ్యూటీ బాగా స్లిమ్ అయింది

By:  Tupaki Desk   |   28 Nov 2015 5:30 PM GMT
బ్యూటీ బాగా స్లిమ్ అయింది
X
టాలీవుడ్ అప్ కమింగ్ స్టార్ హీరోయిన్లలో రాశి ఖన్నా కూడా ఉంది. ఇప్పటికి యంగ్ హీరోయినే అయినా.. కరెక్ట్ హిట్ ఒకటి పడిందంటే... స్టార్ స్టేటస్ వచ్చేస్తుంది ఈ సుందరికి. ప్రస్తుతానికి ఆ మెట్టు ఇంకా ఎక్కకపోయినా.. టఫ్ కాంపిటీషన్ మాత్రం ఇచ్చేస్తోంది. అందుకే ఈ చిన్నదాన్ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకునేందుకు కంపెనీలు క్యూ కట్టేస్తున్నాయి. ఈరోజే ఓ సంస్థ.. హైద్రాబాద్ కుకట్ పల్లిలో ఓ మాల్ ప్రారంభించింది. దీన్ని రాశి ఖన్నా ఓపెన్ చేసింది.

ఈ కార్యక్రమంలో రాశిని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మామూలుగా ఈ భామ కాస్త బొద్దుగా ముద్దుగా ఉంటుంది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిన లుక్ తో అదరగొట్టేసింది ఈ బ్యూటీ. బహుశా ప్రస్తుతం పోలీస్ కేరక్టర్ చేస్తున్న ప్రభావం కాబోలు.. బాగానే వర్కవుట్స్ అవీ చేసేసి మొత్తం కరిగించేసింది. సాయిధరం తేజ్ సరసన సుప్రీం మూవీలో పోలీస్ గెటప్ కనిపించనుంది ఈ సుందరి. ఖాకీ డ్రస్ కి కొత్త కలరింగ్ ఇవ్వడంతో పాటు.. తను ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు బాగానే కష్టపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటికైతే రవితేజకి జంటగా నటించిన బెంగాల్ టైగర్ మూవీ రిలీజ్ కోసం రాశి ఖన్నా వెయిట్ చేస్తోంది.

అమ్మడికి అందం ఉంది, గ్లామర్ ఉంది, దాన్ని ఎక్స్ పోజ్ చేసుకునే సత్తా ఉంది, చేతినిండా ఛాన్సులున్నాయి. కావాల్సిందల్లా ఒక్క హిట్ మాత్రమే. దానికోసం బాగానే ఎదురుచూస్తోంది ఖన్నా. బెంగాల్ టైగర్ తో రవితేజ తనకు ఆ ఆశ కూడా తీర్చేస్తాడని బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.