Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్-చరణ్ మల్టీ స్టారర్ లో రాశి ఖన్నా

By:  Tupaki Desk   |   20 Feb 2018 8:34 AM GMT
ఎన్టీఆర్-చరణ్ మల్టీ స్టారర్ లో రాశి ఖన్నా
X
హీరొయిన్ రాశి ఖన్నా తన కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకునేలా ఉంది. వరుణ్ తేజ్ తో చేసిన తొలిప్రేమ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు ఐదేళ్ళ సీనియారిటీ ఉన్న హీరొయిన్ దీనికి సూట్ అవుతుందా అనే కామెంట్స్ వినిపించాయి. కాని వాటిని పటాపంచలు చేస్తూ తన పెర్ఫార్మన్స్ తో మెప్పించిన రాశి ఖన్నా గ్లామరస్ గా ఉండే పాత్రలతో పాటు తాను ఎటువంటివైనా చేస్తానని మాటల్లో కాకుండా చేతల్లో చూపించింది. అంతకు ముందు వచ్చిన టచ్ చేసి చూడు చిన్న ట్విస్ట్ ఇచ్చినా తొలిప్రేమ పుణ్యమా అని ఆ ఫెయిల్యూర్ ని ఎవరు పట్టించుకోలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాశి ఖన్నాకు ఓ బంపర్ ఆఫర్ తగిలినట్టు టాక్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి తీయబోయే మల్టీ స్టారర్ లో ఒక హీరొయిన్ గా రాశి ఖన్నా వైపే జక్కన్న మొగ్గు చూపుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. చరణ్ సరసన జోడిగా తనైతేనే బాగుంటుందనే చర్చ జరిగిందట. నిజంగా అనుకున్నారా లేక ఇంకా ఆలోచిస్తున్నారా అనేది అఫీషియల్ గా తెలిసే అవకాశం ఇప్పటికిప్పుడు లేదు కాబట్టి పూర్తిగా అయితే కొట్టిపారేయలేం. దీపావళి లేదా దసరాకు షూటింగ్ మొదలు పెట్టుకునే అవకాశం ఉన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసుకోవడంలో రాజమౌళి యమా బిజీ గా ఉన్నాడు. చివరి నిమిషంలో హడావిడి ఎందుకని అన్ని ఒక కొలిక్కి తెస్తున్నట్టు టాక్.

ఒకవేళ ఇదే జరిగితే రాశి ఖన్నా లక్ మరో మెట్టు పైకెక్కినట్టే. రాజమౌళి సినిమాల్లో హీరొయిన్లకు మంచి గుర్తింపు వచ్చేలాగే పాత్రలు డిజైన్ చేస్తాడు. అందులోనూ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా రూపొందే మూవీ కాబట్టి రాశికి ఇది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. లాస్ట్ ఇయర్ తారక్ తో జై లవకుశలో చేసేసింది కాబట్టి ఇప్పుడు చరణ్ పక్కన స్పెషల్ గా ఉంటుంది. ఇది అఫీషియల్ గా ప్రకటించింది కానప్పటికీ ఫాన్స్ మాత్రం చరణ్ పక్కన రాశి జోడి గురించి అప్పుడే తమ ఊహలకు పని కల్పిస్తున్నారు. తారక్ సరసన జోడి కోసం వేట కొనసాగుతోంది.