Begin typing your search above and press return to search.

పులి పైనే ఆశలు పెట్టుకున్న ఖన్నా

By:  Tupaki Desk   |   10 Oct 2015 9:30 AM GMT
పులి పైనే ఆశలు పెట్టుకున్న ఖన్నా
X
రాశి ఖన్నా.. స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నా ఇప్పటి వరకూ ఆ ఛాన్స్ రాలేదు ఈ భామకు. శివం ఎన్ని ఆశలు పెట్టుకున్నా.. అవన్నీ అడియాశలైపోయాయి. స్రవంతి మూవీస్ లాంటి బ్యానర్, రామ్ లాంటి ఎనర్జీ హీరో కూడా రాశికి హిట్ ఇవ్వలేకపోయారు. దీంతో ఇప్పడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూపులు చూస్తోంది. రవితేజ తన ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ వేస్తాడని హోప్స్ పెట్టుకుంది. ప్రస్తుతం రవితేజతో బెంగాల్ టైగర్ లో నటిస్తోంది రాశి ఖన్నా.

ఈ చిత్రంలో తమన్నా కూడా ఉండగా.. సెకండ్ హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. బెంగాల్ టైగర్ లో ఈమెది విభిన్నమైన పాత్ర.. మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తూ.. పక్కింటి అమ్మాయిలా మురిపించనుంది. శ్రద్ద అనే ఈ కేరక్టర్ కోసం బాగానే కసరత్తు చేశానని.. తన రోల్ కి మంచి పేరు వస్తుందంటోంది రాశి ఖన్నా. సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. రచ్చ హిట్ తర్వాత.. పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ చేసేందుకు ఎదురూచూసి, చివరకు బెంగాల్ టైగర్ చేస్తున్నాడు సంపత్. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి తనను తప్పించడంతో.. బెంగాల్ టైగర్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. మాస్ మహరాజాతో ఎలాగైనా సక్సెస్ సాధించి.. తన స్టామినా ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు.

ఇఫ్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీ ట్ చేసుకుంది బెంగాల్ టైగర్. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసేసి.. నవంబర్‌ 5న సినిమా విడుదల చేయాలనేది ప్రస్తుత ప్లాన్‌. అంటే రాశిఖన్నాను మళ్లీ ఓ నెలరోజుల్లోనే ఆన్ స్క్రీన్ పై చూడచ్చన్న మాట.