Begin typing your search above and press return to search.

కుర్రాళ్లు రాశి బర్త్ డే సెలబ్రేట్‌ చేశారు

By:  Tupaki Desk   |   30 Nov 2015 10:28 AM GMT
కుర్రాళ్లు రాశి బర్త్ డే సెలబ్రేట్‌ చేశారు
X
ఒకప్పుడు సినిమా హీరోయిన్స్ ఎవరికి వారే అన్నట్లుగా ఉండేవాళ్లు. ఎవరో కొందరు మాత్రమే థిక్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. కానీ ఇపుడు కాలంతో పాటే ట్రెండ్ కూడా మారిపోయింది. ఓ హీరోయిన్ బర్త్ డే పార్టీలో మరో కాంటిటీటీవ్ భామ రెచ్చిపోయి సందడి చేసేంతగా రిలేషన్స్ పెరుగుతున్నాయి. నవంబర్ 30న రాశి ఖన్నా పుట్టిన రోజు. ఈ రోజుతో ఈ సుందరి 23 ఏళ్లు పూర్తి చేసుకుని.. 24 వ ఏట అడుగుపెట్టింది.

ఈ సందర్భంగా ఇచ్చిన పార్టీకి ఆమె ఇండస్ట్రీ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది హాజరయ్యారు. హీరోల్లో అయితే రవితేజ - రామ్ - అల్లు శిరీష్ - సాయి ధరం తేజ్ - వరుణ్ తేజ్ - సందీప్ కిషన్ లు పార్టీలో సందడి చేయగా.. మరో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెచ్చిపోయి మరీ గోల చేసేసింది. రాశి ఖన్నా పుట్టినరోజు పార్టీలో సెల్ఫీల హడావిడి.. ఆ సందడిని ఫోటోలు తీసి ట్విట్టర్ లో పెట్టడం - మొత్తమంతా రకుల్ నానా హంగామా చేసేసింది. అంతేకాదు.. "నాకెంతో ఇష్టమైన రాశి ఖన్నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఈ ఏడాది సూపర్ హిట్ ఇయర్ కావాలని కోరుకుంటున్నా.. ఎప్పుడూ ఇలాగే నవ్వాలని అభిలషిస్తున్నా" అంటూ పెద్ద ట్వీట్ కూడా పెట్టింది రకుల్ ప్రీత్. ఇలా ఒకరి బర్త్ డే రోజున మరో హీరోయిన్ ఇంత సందడి చేసిన సందర్భాలు.. టాలీవుడ్ లో చాలా తక్కువ అని చెప్పాలి.

ఇక రాశిఖన్నా నటించిన బెంగాల్ టైగర్ ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. రవితేజ తనకు బ్లాక్ బస్టర్ అందిస్తాడని రాశి బాగానే హోప్స్ పెట్టుకుంది. మరోవైపు సాయి ధరం తేజ్ సరసన సుప్రీంలో ఆడిపాడుతోందీ చిన్నది. ఈ మూవీలో పోలీస్ పాత్ర నటిస్తుండడం విశేషం. పర్ఫెక్ట్ పోలీస్ అనిపించుకోవడం కోసం అమ్మడు బాగా వెయిట్ కూడా తగ్గింది.