Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ స్టార్ దంప‌తుల‌కు అరుదైన గిఫ్ట్

By:  Tupaki Desk   |   23 Aug 2019 5:30 PM GMT
కేజీఎఫ్ స్టార్ దంప‌తుల‌కు అరుదైన గిఫ్ట్
X
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్మోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఒకే ఒక్క `కేజీఎఫ్‌` అత‌డి ఫేట్ నే మార్చేసింది. ప్ర‌స్తుతం ఈ సినిమా సీక్వెల్ లో న‌టిస్తూ బిజీగా ఉన్న‌ సంగ‌తి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక‌పోతే కేజీఎఫ్ స్టార్ య‌శ్ ఫ్యామిలీ లైఫ్ గురించి తెలిసిందే. అత‌డు అందాల క‌థానాయిక రాధిక పండిట్ ని పెళ్లాడాడు. ఈ జంట‌కు ఇదివ‌ర‌కూ ఓ ఆడ‌పిల్ల జ‌న్మించింది.

త‌న‌కు కూతురు పుట్ట‌డం అరుదైన‌ హ్యాపీ మూవ్ మెంట్. బిడ్డొచ్చిన వేళా విశేషం.. అదే నెల‌లో `కేజీఎఫ్` రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకోవ‌డం.. య‌శ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకోవ‌డం గొప్ప మూవ్ మెంట్ ఆ జంట‌కు. అందుకే య‌శ్ - రాధికా పండిట్ దంప‌తులు త‌మ బిడ్డ‌కు సంబంధించిన‌ ప్ర‌తి ఒక్క మెమ‌రీని ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా ఫోటో- రెమెడీస్ రూపంలో దాచుకోవాల‌నుకుంటున్నారు.

అయితే ఈ ఆకాంక్ష‌ను గ్ర‌హించిన‌ రాధికా పండిట్ మేక‌ప్ మేన్ ఆ జంట‌ కూతురు చిట్టి పాదాలు లేలేత‌ చేతుల గుర్తులు తీసుకుని వాటికి ఫోటో ఫ్రేమ్ ని రూపొందించి కానుక‌గా ఇచ్చారు. దీంతో ఆ స్టార్ క‌పుల్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇది త‌మ జీవితంలో మ‌ర్చిపోలేని తీపి జ్ఞాప‌కం. కూతురు పెద్ద‌య్యాక త‌న చిట్టి చేతుల్ని.. బుజ్జి పాదాల్ని త‌న‌కు చూపించాల‌నేది ఆ జంట‌ కోరిక‌. రాధిక పండిట్ ప్ర‌స్తుతం రెండోసారి ఫ్రెగ్నెన్సీతో ఉన్నారు. ఈ సంద‌ర్భంగానూ య‌శ్ ఎంతో కేరింగ్ గా ఉంటున్నాడ‌ట‌. ఈ మూవ్ మెంట్ గురించి తెలిసిన‌ అభిమానులు చాలా ఎగ్జ‌యిటింగ్ గా ఉన్నారు. య‌శ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ ప్రొఫెష‌న‌ల్ లైఫ్ ఎంతో వేగంగా దూసుకుపోతోంద‌ని కితాబిచ్చేస్తున్నారు. `కేజీఎఫ్ 2` రిలీజ్‌ టైమ్ కి మ‌రో గుడ్ న్యూస్ చెబుతాడ‌నే ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈసారి జూనియ‌ర్ రాకింగ్ స్టార్ పుడ‌తాడో లేక మ‌రోసారి జూ.రాధిక‌నా? అన్న‌ది చూడాల‌న్న‌ది ఫ్యాన్స్ ఆశ అట‌.

For Video Click Here