Begin typing your search above and press return to search.

రావుగోపాల్ రావ్‌ లా రెచ్చిపోతున్నాడు

By:  Tupaki Desk   |   4 Aug 2015 8:16 AM GMT
రావుగోపాల్ రావ్‌ లా రెచ్చిపోతున్నాడు
X
విలన్‌ అంటే రావుగోపాల్‌ రావ్‌ లా ఉండాలంటారు! ఓ నటుడికి అంతకంటే గొప్ప ప్రశంస ఇంకోటి ఉండదు. తెలుగు సినీపరిశ్రమలో ఆయనలా నటించగలిగే మరో విలన్‌ ఇప్పటికీ రాలేదనే చెబుతుంటారు. విలనీ చేస్తూనే కామెడీ పండించిన గొప్ప నటుడు గోపాల్ రావ్‌. తనకంటూ ఓ ప్రత్యేక ఆహార్యం, గుర్తింపు ఉన్న స్పెషలిస్ట్‌. అందుకే చిరస్థాయిగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయాడు.

మెగాస్టార్‌ హయాంలో కెరీర్‌ లో పీక్స్‌ చూశారాయన. ఇప్పుడు అతడి వారసుడు కూడా పీక్స్‌ లోనే ఉన్నాడు. రావుగోపాల్‌ రావ్‌ తనయుడిగా టాలీవుడ్‌ లో ఏడేళ్ల క్రితం అడుగుపెట్టాడు రావు రమేష్‌. ఈ ఏడేళ్లలో చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించారాయన. తండ్రిలానే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు. గత ఏడాది వరుణ్‌ తేజ్‌ సినిమా 'ముకుంద'లో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవలే 'రౌడీ ఫెలో' చిత్రంలోనూ చక్కగా అభినయించాడన్న పేరొచ్చింది. ఇప్పటికిప్పుడు స్టార్‌ హీరోలతో పాటు అందరి సినిమాల్లోనూ అతడి కంటూ ఓ క్యారెక్టర్‌ కంపల్సరీ అయ్యింది.

ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, బ్రహ్మూెత్సవం, సినిమా చూపిస్త మావ చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. చరణ్‌-వైట్ల సినిమా, అల్లు శిరీష్‌ -పరశురామ్‌ సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్‌-భీమనేని సినిమాలలో నటించేందుకు సంతకాలు చేశాడు. ఇవన్నీ వేటికవే ప్రత్యేకం. వేటికవే విభిన్నమైన పాత్రలు. కెరీర్‌ లో పూర్తి బిజీ. అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్న నా దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు అని చెబుతున్నాడు.