Begin typing your search above and press return to search.

దీపిక రణ్‌ వీర్‌ ల వెడ్డింగ్‌.. మరోటి వచ్చింది

By:  Tupaki Desk   |   17 Nov 2018 2:12 PM GMT
దీపిక రణ్‌ వీర్‌ ల వెడ్డింగ్‌.. మరోటి వచ్చింది
X
ప్రస్తుతం బాలీవుడ్‌ తో పాటు దేశ వ్యాప్తంగా కూడా రణ్‌ వీర్‌ సింగ్‌ - దీపిక పదుకునేల వివాహం గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరు ఇటలీలోని ఒక దీవిలో వివాహం చేసుకున్నారు. రెండు మతాలకు చెందిన వీరు రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈనెల 14న కొంకణి సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్న వీరు, 15వ తారీకున సింథి సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి అత్యంత వైభవంగా - అత్యంత భద్రత మద్య జరిగింది. అతి కొద్ది మంది సినీ ప్రముఖులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే వీరి పెళ్లిలో పాల్గొన్నారు.

ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు మరియు వీడియోల గురించి సోషల్‌ మీడియాలో జనాలు తెగ వెదికేస్తున్నారు. కాని వీరి పెళ్లి వీడియోలు కాని ఫొటోలు కాని ఏవి బయటకు రావడం లేదు. వారు అధికారికంగా విడుదల చేసిన రెండు ఫొటోలు మాత్రమే ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో సందడి చేశాయి. ఆ రెండు ఫొటోలను చూసి అభిమానులు మురిసి పోయారు. ఇప్పుడు తాజాగా మరో ఫొటో రివీల్‌ అయ్యింది. రణ్‌ వీర్‌ సింగ్‌ స్టైలిష్‌ నటాషా గౌరవ్‌ ఈ ఫొటోను పోస్ట్‌ చేసింది.

నిటాషా అండ్‌ టీం రణ్‌ వీర్‌ మరియు దీపికలతో పాటు వారి కుటుంబ సభ్యులను మేకప్‌ చేసేందుకు అక్కడకు వెళ్లారు. పెళ్లి తంతు అంతా ముగిసిన తర్వాత నిటాషా టీం కొత్త జంటతో ఫొటో దిగారు. ఆ ఫొటోనే నిటాషా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. వీరి పెళ్లికి సంబంధించిన ఇంకొన్ని ఫొటోలు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రంకు ఇండియా చేరుకోబోతున్న కొత్త జంట - బెంగళూరులో మొదట పార్టీ ఇవ్వబోతున్నారు. 21వ తారీకున బెంగళూరులో వీరి పార్టీ జరుగనుంది. ప్రముఖులు ఆ పార్టీలో పాల్గొనబోతున్నారు. అలాగే ముంబయిలో కూడా రిసెప్షన్‌ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.