ఆ పెళ్లిలో కొత్త జంటల రుబాబ్

Mon Dec 10 2018 12:38:50 GMT+0530 (IST)

రాజుగారి ఇంట పెళ్లంటే మంత్రి అయినా సరే నాగిని నాట్యం ఆడాలన్నదో రూల్! లేదంటే మంత్రి తల తెగిపోద్ది!! అమెరికన్ పాప్ సింగర్ బియాన్స్ కే కాదు.. ఇండస్ట్రీ బెస్ట్ సెలబ్రిటీలకు అదో ఆటవిడుపు కావాలి. రాజాజ్ఞను పాటించి చిత్తం మహాప్రభో మీరు ఆజ్ఞ వేయాలే కానీ! అంటూ మోకరిల్లాలి. డ్యాన్సాడాలి.. విందారగించి తాగి ఊగాలి .. లేదంటే తస్మాత్ జాగ్రత్త!!అంతెందుకు నిన్నగాక మొన్న పెళ్లి చేసుకుని - కాలి పారాణి అయినా ఆరకముందే ఆ పెళ్లికూతురు ఏకంగా అంబానీల పెళ్లికి వచ్చి నాగిని నాట్యం ఆడిందంటేనే అర్థం చేసుకోవాలి. ఇషా అంబానీ పెళ్లి వేడుకలో బియాన్స్ మెరుపుల గురించి మాట్లాడుకుంటున్న అదే యూత్ ఈ వేడుకలో దీపిక పదుకొనే- రణవీర్ సింగ్ జంట స్టెప్పుల్ని అంతే ఇదిగా ముచ్చటించుకుంటున్నారు. కొత్త జంట మత్తుగా చిత్తుగా డ్యాన్సాడి యూత్ లో హాట్ టాపిక్ అయ్యారు. ఇదే పెళ్లి వేడుకలో ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జంట సైతం ఇదే తీరుగా డ్యాన్సులాడి ఊగిపోవడంపైనా యువతరంలో వాడి వేడి చర్చ సాగుతోంది.

గడిచిన కొద్ది రోజులుగా అసలు బాలీవుడ్ పెళ్లి వేడుకలతో కళకళలాడిపోతోంది. దీపిక - రణవీర్ - ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ పెళ్లితో కొత్త కళ వచ్చింది. ఆ క్రమంలోనే అంబానీల ఇంట పెళ్లి వేడుకతో బాలీవుడ్ యావత్తూ ఈ పెళ్లిలో దిగిపోయి సందడి చేస్తోంది. ముంబై నుంచి ఉదయ్ పూర్ కి రప్పించి మరీ అంబానీ తనదైన స్టైల్లో టాప్ సెలబ్రిటీలతో సెలబ్రేషన్స్ చేసుకోవడం వాడి వేడిగా చర్చకొచ్చింది.