హీరో.. హీరోయిన్ రీల్ లో రియల్ క్యారెక్టర్స్

Thu Jun 13 2019 07:00:02 GMT+0530 (IST)

సుదీర్ఘ ప్రేమ తర్వాత బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మరియు దీపిక పదుకునేలు పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత వీరిద్దరు చాలా అన్యోన్యంగా కలిసి జీవితాన్ని గడిపేస్తున్నారు. ఆమద్య ఒక కార్యక్రమంలో దీపిక చీర కొంగు పట్టుకుని రణవీర్ కనిపించి పెళ్లాం చాటు మొగుడు అనిపించుకున్నాడు. వీరిద్దరు క్యూట్ కపుల్ అంటూ ప్రశంసలు దక్కించుకుంటున్నారు. వీరిద్దరు రియల్ లైఫ్ లోనే కాకుండా రీల్ లైఫ్ లో కూడా భార్య భర్తలు కాబోతున్నారు.1983 ప్రపంచ కప్ నేపథ్యంలో '83' అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. రణవీర్ సింగ్ ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రను పోషించబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో కపిల్ దేవ్ భార్య పాత్ర కోసం పలువురు హీరోయిన్స్ ను పరిశీలించడం జరిగింది. చివరకు రణవీర్ కపూర్ కు జోడీగా ఆయన భార్య దీపిక పదుకునే అయితేనే బాగుంటుందనే అభిప్రాయంకు దర్శకుడు కబీర్ ఖాన్ అభిప్రాయ పడ్డాడు.

'83' చిత్రంలో రణవీర్ సింగ్ కు జోడీగా దీపికను ఎంపిక చేసినట్లుగా ప్రకటించేందుకు చిన్న సరదా వీడియోను విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో దీపిక తన భర్త రణవీర్ సింగ్ తో క్రికెట్ ఆడుతూ బ్యాట్ తో అతడిని కొట్టడం చూపించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నా భార్య పాత్రను నా భార్య కంటే మరెవ్వరు బాగా పోషించలేరు అంటూ రణవీర్ సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఈ చిత్రంను పలు భాషల్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.