Begin typing your search above and press return to search.

ఖాన్‌ త్రయంకు సరైన పోటుగాడు

By:  Tupaki Desk   |   21 Feb 2019 5:36 AM GMT
ఖాన్‌ త్రయంకు సరైన పోటుగాడు
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అనగానే ఖాన్‌ త్రయం అయిన అమీర్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయి. షారుఖ్‌ ఖాన్‌ మెల్ల మెల్లగా ఫేడ్‌ ఔట్‌ అవుతూ వస్తున్నాడు. గత మూడు నాలుగు ఏళ్లుగా షారుఖ్‌ కు ఒక్క మంచి సక్సెస్‌ పడింది లేదు. ఇక సల్మాన్‌ ఖాన్‌ మూడు నాలుగు సినిమాలకు ఒకటి చొప్పున సక్సెస్‌ లు దక్కించుకుంటున్నాడు. అమీర్‌ ఖాన్‌ వరుస విజయాల తర్వాత మొన్నటి థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ తో ఫ్లాప్‌ అయ్యాడు. ఈ ముగ్గురి టైం దగ్గర పడిందని బాలీవుడ్‌ వర్గాల్లో కూడా చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా వీరు స్టార్‌ డంను కలిగి ఉన్నారు.

ఎంత పెద్ద స్టార్‌ అయినా కొన్నాళ్ల వరకే అన్నట్లుగా ఈ ఖాన్‌ త్రయం కూడా త్వరలోనే ఫేమ్‌ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఖాన్‌ త్రయం స్థాయిలో ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో ఎవరు స్టార్‌ డంను దక్కించుకుంటారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు రణ్‌ వీర్‌ సింగ్‌. ఏడాది వ్యవదిలో రణ్‌ వీర్‌ సింగ్‌ పద్మావత్‌, సింబా, గల్లీ బాయ్‌ చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ లను దక్కించుకున్నాడు.

పద్మావత్‌ చిత్రంలో విలన్‌ గా నటించాడు. ఆ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇక తెలుగు టెంపర్‌ రీమేక్‌ 'సింబా' చిత్రం భారీగా వసూళ్లు సాధించింది. 250 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇక తాజాగా గల్లీ బాయ్‌ చిత్రం కూడా ఆ స్థాయిలోనే వసూళ్లను రాబడుతోంది. దాంతో ప్రస్తుతం బాలీవుడ్‌ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా రణ్‌ వీర్‌ సింగ్‌ పేరు మారు మ్రోగి పోతుంది. ఈ యంగ్‌ స్టార్‌ హీరో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. వరుసగా విజయాలు సాధిస్తూ ఖాన్‌ త్రయానికి ఇతడే పోటుగాడు అనేలా చేస్తున్నాడు.