'గల్లీ కుర్రాడికి' ప్రశంసల వర్షం!

Tue Feb 12 2019 11:52:21 GMT+0530 (IST)

ప్రయోగాలకు సరికొత్త ఆలోచనలకు.. నెలవైన బాలీవుడ్ లో మరో ప్రయత్నానికి ప్రశంసల వర్షం కురుస్తుంది. తన సినిమాలతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన జోయ అక్తర్ దర్శకత్వంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రన్వీర్ నటించిన 'గల్లీ గయ్' సినిమా మరో రెండు రోజుల్లో అంటే ప్రేమికుల రోజు సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ క్రమంలో ఈ సినిమాని "బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివెల్" లో ప్రదర్శించడంతో ఈ సినిమా చూసిన  ప్రముఖులు అందరూ మంత్ర ముగ్ధులు కావడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ముఖ్యంగా జోయ అక్తర్ దర్శకత్వానికి అదే క్రమంలో రన్వీర్ నటనా చాతుర్యానికి ఫిదా అయిపోయారట. ఈ సినిమాలో రన్వీర్ నటన చాలా కొత్తగా మునుపెన్నడూ లేని విధంగా ఉంది అని సినిమాపై ప్రశంసల వర్ధం కురిపించేస్తున్నారు ప్రముఖులు. దర్శకుడు జోయతో కలసి సినిమాను వీక్షించిన ప్రఖ్యాత దర్శకుడు క్యామరాన్ బైలీ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇక మరో పక్క ప్రముఖ సినిమా విమర్శ దిగ్గజం జయ్ వేస్బెర్గ్ కూడా సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చింది అని ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఇచ్చారు అని ఇక సినిమా అధ్యంతం ఆకట్టుకుంది అని తెగ పొగిడేశారు.

ఇక ఈ సినిమా కధ విషయానికే వస్తే మురికి వాడల్లో పుట్టిన హీరో తనలో ఉన్న రాప్ టాలెంట్ ను గుర్తించి  తాను ప్రఖ్యాత ర్యాపర్ గా ఎలా మారాడు...తాను కలలు కన్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు. తాను గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నాడు అన్నదే ఈ కధ. మొత్తంగా చూస్తే ఆ ప్రముఖుల ప్రశంసలు వింటే ఈ సినిమా ఖచ్చితంగా బాలీవుడ్ లో మరో భారీ హిట్ గా నిలవనుంది అని పక్కాగా చెప్పవచ్చు. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.