మరో సినిమా పిచ్చోడు..

Sat Jan 20 2018 08:00:01 GMT+0530 (IST)

పిచ్చి అనే పదం సందర్భాన్ని బట్టి ఎలా వాడాలో మన హీరోలు మనకు చెప్పకుండానే చూపించేశారు. ఇష్టమైన పని చేయడంలో ఉన్న ఆనందం మరొకటి ఉండదు. అందులో ఎంత కష్టం ఎదురొచ్చిన తీపిగానే ఉంటుంది. అంత పిచ్చిగా వారి పనులను ఇష్టపడతారు మన ఇండియన్ సినిమా హీరోలు. ఉదాహరణకు విక్రమ్ ని తీసుకుంటే తన ప్రాణాలను సైతం పాత్ర కోసం ధారా పోసేలా ఉన్నాడని అందరు అనుకునేలా ఐ సినిమాతో చూపించాడు. ఆ సినిమాలో ఒక పాత్ర కోసం విక్రమ్ బరువు చాలా తగ్గిపోయాడు.ఆ సినిమా హిట్ అవ్వకపోయినా విక్రమ్ నటనపై భారీ ప్రశంసలు అందాయి. అంతే కాకుండా కమల్ హాసన్ అమీర్ ఖాన్ సూర్య రాజ్ కుమార్ రావ్ వంటి వారు ఒక సినిమాలో పాత్ర కోసం  శరీర ఆకృతిలో ఉహించని విధంగా  మార్పులు చేసి ఎంతగానో ఆకట్టుకున్నారు. సినిమా ప్రపంచం అంటే ఎంత పిచ్చో చెప్పారు. కాదు చూపించేశారు. ఇక ఆ లిస్ట్ లో మరో హీరో కూడా తన మంచి పిచ్చిని చూపించేశాడు. అతనే యువ హీరో రన్ వీర్ సింగ్. ప్రస్తుతం ఈ హీరో చేస్తోన్న చిత్రాలు చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. పాత్ర కోసం చాలా కష్టపడుతున్నాడు. పాత్ర కోసం మొండి గటంలా పని చేస్తున్నాడు.

గత ఏడాది పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర కోసమని తన బాడీని చాలా వరకు పెంచాడు. అయితే ఆ సినిమా తరువాత గల్లీ బాయ్ ఒకే చేసిన రన్ వీర్ అందులో ఒక చిన్న శరీర ఆకృతి ఉన్న యువకుడిగా కనిపించాలని ఒక్కసారిగా శరీరంలో మార్పులు చేశాడు. అందుకోసం ఈ హీరో ఎంతగా కష్టపడ్డాడో పైన కనిపిస్తోన్న రెండు ఫొటోల్లోని వ్యత్యాసాన్ని గమనిస్తే మనకే అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. సినిమా అంటే రన్ వీర్ కి ఎంత పిచ్చో అని నెటీజన్స్ చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.