పెళ్లి కూతురు చెవి కొరికాడు

Thu Nov 15 2018 21:40:45 GMT+0530 (IST)

పెళ్లి అంటే మామూలు ముచ్చటా?  పైగా ఇటలీ లేక్ కోమోలో వరల్డ్ రిచ్చెస్ట్ పర్సనాలిటీస్ మాత్రమే అడుగుపెట్టే చోట దీప్ -వీర్ పెళ్లి జరుగుతోంది అంటే ప్రపంచం కళ్లు అక్కడే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఊరంత పందిళ్లు వేయనక్కర్లేదు. మేళ తాళాలు.. సన్నాయి బ్యాండు అసలే అఖ్కర్లేదు. లేక్ కోమో డెకరేషన్ ఒక్కటి చాలు.. కళ్లు రెండే ఉంటే చాలవు అన్నంత అంగరంగ వైభవంగా ఉందా వెన్యూ. అలాంటి చోట దీపిక మెడలో మూడు ముళ్లు వేశాడు రణవీరుడు.14 - 15 తేదీల్లో (ఈ రెండ్రోజులు) పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రోజు కొంకణి స్టైల్లో - రెండోరోజు సింధీ స్టైల్లో ఈ జంట పెళ్లాడుకున్నారు. కొంకణి పెళ్లి గెటప్ ని - అలానే సింధీ పెళ్లిలో గెటప్ ని ఆ ఇద్దరూ తాజాగా రివీల్ చేశారు. రణవీర్ - దీపిక ఇద్దరూ కూడబలుక్కున్నట్టు ఒకరి తర్వాత ఒకరు ఈ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అభిమానుల్లో ఈ ఫోటోలు జోరుగా వైరల్ అయిపోతున్నాయి.

మా ఇలాకాలో పెళ్లిల్లు ఇలాగే ఉంటాయ్! అని రణవీర్ చెబుతుంటే - మా ఇలాకాలో ఇంతే సంబరంగా జరుగుతాయ్! అంటూ దీపిక పదుకొన్ నవ్వులు చిందించేస్తోంది. కొంకణీ పెళ్లిలో పెళ్లి కొడుకు వధువు చెవి కొరికేస్తున్నాడు సుమీ! మొత్తానికి కులమతాలు వేరైనా.. ప్రాంతాలు వేరైనా మనుషులు ఒక్కటే! అని మా బాగానే చెప్పారు ఈ పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు. కులాల కోసం కోసేసుకోవడం.. మతాల కోసం కొట్టేసుకోవడం మాకు తెలీదు అన్నట్టే ఉంది వీళ్ల వాలకం.